రాక్ స్టార్ శ్రుతి కొత్త ఆల్బం
- May 12, 2016 / 01:23 PM ISTByFilmy Focus
కూసే కోయిల ఎంత సేపు పాడకుండా ఉండగలదు. అనందం కలిగినప్పుడు.. మనసు పులకించినప్పుడు రాగాలు వినిపిస్తుంది. మహా నటుడు కమల్ కూతురు, రాక్ స్టార్ శ్రుతి హాసన్ విషయంలో కూడా ఇదే జరిగింది. ఆమె సినిమాల్లో నటించక ముందు సింగర్. పాటలు పాడడం, రాయడమే కాదు.. స్వరాలూ కూర్చేది. ఎంతో ఉత్సాహంతో స్టేజీలఫై డాన్సు చేసేది. తమిల్, తెలుగు మూవీస్లో బిజీ కావడంతో గిటార్ కు దూరమైంది. అయినా ఆగడు(జంక్చన్ లో ), రేసుగుర్రం(డౌన్ డౌన్) చిత్రాల్లో పాటలు పాడింది.
ప్రస్తుతం బ్రిటిష్ రాక్ బ్యాండ్ “డైనోసర్ పిలే – అప్” తో కలసి మ్యూజిక్ ఆల్బంను రిలీజ్ చేసే పనిలో బిజిగా ఉంది. ఈ ఆల్బం కోసం శ్రుతి లండన్ వెళ్ళింది. పాటలు రాయడంలో సహాయం చేసింది. కొన్ని స్వరాలూ కూర్చింది. ఈ ఆల్బంను ఎంతో ఇష్టంతో శ్రుతి చేసినట్లు ఆమె సన్నిహితులు చెప్పారు. త్వరలో రిలీజ్ కానుంది.
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus













