మళ్ళీ హీరోయిన్ గా బిజీ అవుతున్న శృతీ హాసన్?

టాలీవుడ్లో అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది కమల్ హాసన్ కూతురు శృతీ హాసన్. మొదట్లో ఆమె చేసిన సినిమాలన్నీ ప్లాపులయ్యాయి కానీ పవన్ కళ్యాణ్ తో చేసిన ‘గబ్బర్ సింగ్’ బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఆమెకు వరుస అవకాశాలు క్యూలు కట్టాయి. అంతేకాదు ఆ తరువాత ఆమె చేసిన ‘బలుపు’ ‘రేసు గుర్రం’ ‘ఎవడు’ ‘శ్రీమంతుడు’ ఇలా ఆమె చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్లు అయ్యాయి. అయితే ఇలా కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే సినిమాలు తగ్గించేసింది.

దీనికి ప్రధాన కారణం ఆమె మైకేల్‌తో ప్రేమలో ఉండటమే అని అందరికీ తెలిసిన సంగతే. తన ప్రియుడితో కలిసి ఆమె ఎక్కువగా లండన్‌లో ఉంటూ మ్యూజిక్ షోలు చేస్తూ వచ్చింది. దీంతో దర్శక నిర్మాతలు కూడా ఆమెను ఇగ్నోర్ చేయడం మొదలుపెట్టారు. ‘కాటంరాయుడు’ చిత్రం తర్వాత ఆమె సినిమాలకు పూర్తిగా దూరమైంది. అయితే ఇప్పుడు తన ప్రియుడు నుండీ విడిపోయింది కాబట్టి మళ్ళీ సినిమాలు చేయడానికి రెడీ అయ్యిందని సమాచారం. ఇప్పటికే విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో తెరకెక్కుతున్న ఓ చిత్రంలో హీరోయిన్ గా ఎంపికయ్యింది. అంతేకాదు మెగాస్టార్, కొరటాల శివ రూపొందించబోయే చిత్రంతో పాటూ గోపీచంద్ మలినేని-రవితేజ కాంబినేషన్లో తెరకెక్కబోయే చిత్రంలో కూడా శృతీ ని ఎంచుకున్నారట. ఏదేమైనా బ్రేకప్ అయితే తప్ప ఈ బ్యూటీకి సినిమాలు గుర్తుకు రాలేదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus