శృతి హాసన్ వచ్చి కాజల్ కి ఎసరు పెట్టింది

పాపం కాజల్ పరిస్థితి ఈమధ్య ఏమీ బాలేదు. ఆమె ఏ సినిమా చేసినా ప్లాప్ అవుతూనే వస్తుంది. ఇప్పటీకే ‘కవచం’ ‘సీత’ ‘రణరంగం’ అలాగే తమిళ్ లో చేసిన ‘కొమాలి’ వంటి చిత్రాలు ప్లాపయ్యాయి. ఒక్క ‘సీత’ చిత్రం పక్కన పెడితే మిగిలిన సినిమాల్లో కనీసం ఆమె పాత్రకి గానీ నటనకి గానీ ఏమాత్రం మంచి రెస్పాన్స్ రాకపోగా… ఈ సినిమాల్లో కాజల్ ఎందుకు ఉందా అనే క్వశ్చన్ మార్క్ అందరిలోనూ ఉంది. ‘రణరంగం’ వంటి సినిమాలో ఆమె ఎందుకుందో తెలీదు. ఏదో కోటిన్నర రెమ్యూనరేషన్ కి ఆశపడి మాత్రమే ఆ సినిమా చేసిందా అనే సందేహం కూడా కలుగుతుంది.

పోనీ తనదగ్గరికి దర్శక నిర్మాతలు కథలతో వస్తే… వాళ్ళని రెమ్యూనరేషన్ తో భయపెట్టి మరీ పరుగులు పెట్టిస్తుంది. ఇప్పటీకే ‘రాజు గారి గది3’ ‘బంగార్రాజు’ వంటి ప్రాజెక్టులను అలాగే పోగొట్టుకుందట. ఇది పక్కన పెట్టినా రవితేజ, అజయ్ భూపతి కాంబినేషన్లో ‘మహాసముద్రం’ అనే ప్రాజెక్ట్ మొదలు కావాల్సి ఉంది. ఈ చిత్రంలో కాజల్ ను హీరోయిన్ గా అనుకున్నారట. అయితే కొన్నికారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యింది. ఇది పక్కన పెడితే ఈ అదే రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని డైరెక్షన్లో కూడా ఓ చిత్రం తెరకెక్కబోతుంది. ఈ చిత్రంలో కూడా మొదట కాజల్ ను హీరోయిన్ గా అనుకున్నారట. కానీ కాజల్ చెప్పిన రెమ్యూనరేషన్ గురించి బయపడి ఇప్పుడు శృతి హాసన్ కోసం సంప్రదింపులు జరుపుతున్నారట. మొదట కొంచెం ఆలోచించి చెప్తాను అని శృతి చెప్పడంతో… కాజల్ కు ఈ ప్రాజెక్ట్ దక్కడం ఖాయమని సంభరపడిపోయిందట. అయితే ఆమె అంచనాల్ని తలక్రిందులు చేస్తూ… శృతి హాసన్ ఓకే చెప్పేసిందని తెలుస్తుంది. దీంతో కాజల్ అసలా పై శృతి నీళ్ళు జల్లేసినట్టైంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus