శృంగార సన్నివేశాలకు ఓకే చెప్పిన శ్రుతి

బాలీవుడ్‌లో స్టార్ హీరోల పక్కన హీరోయిన్‌గా నటించే అవకాశం వచ్చిందంటే సౌత్ హీరోయిన్లు ఎగిరి గంతేస్తారు. కానీ, దానికి భిన్నంగా ఓ బాలీవుడ్ హీరో సరసన నటించడానికి భారీ మొత్తంలో పారితోషికం ఇస్తామని చెప్పినప్పటికీ నో చెప్పింది పూజా హెగ్డే. ఆ హీరోతో కొన్ని హాట్ సన్నివేశాల్లో నటించాల్సి వస్తుందని తెలిసి ఆ ఆఫర్‌ని తిరస్కరించిందట. ఆ బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం. అంతర్జాతీయ స్థాయిలో భారీ యాక్షన్ మూవీగా ‘రాహ్’ అనే హిందీ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు మిలాప్ జవేరి. తమ రెండో ప్రయుత్నంగా తమన్నాని సంప్రదించిందట యూనిట్. కథ విన్న తమన్నా సినిమా చేయడానికి ఒప్పుకుంది.

కానీ శృంగార సన్నివేశాల విషయాన్ని ఆమె ముందు ఉంచినపుడు వెంటనే నో చెప్పేసిందట. ఈ ఇద్దరు హీరోయిన్లు తిరస్కరించడంతో ఇప్పుడు శ్రుతిహాసన్‌ని సంప్రదిస్తున్నారని తెలిసింది. గతంలో జాన్ అబ్రహం, శ్రుతి హాసన్ కలిసి ‘రాకీ హ్యాండ్సమ్’ చిత్రంలో నటించారు. ఆ సినిమాలో వీరిద్దరి కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయింది. ‘రాహ్’ చిత్రంలో కూడా భారీగా శృంగార సన్నివేశాలు ఉంటాయని తెలిసింది. ఈ సినిమాలో శ్రుతిహాసన్ నటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సమాచారం. మరి శ్రుతి ఈసారి జాన్‌తో నటించడానికి ఓకే చెబుతుందో లేక పూజా, తమన్నా దారిలోనే వెళ్తుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus