శ్వేత “అరెస్ట్” పై అసలు విషయం ఇదే???

శ్వేత బసు ప్రసాద్…కొత్త బంగారు లోకం సినిమాలో కొత్తగా పరిచయం అయింతే ఈ కలకత్తా బ్యూటీ….మంచి గుర్తింపు తెచ్చుకుంది…ఆ తరువాత పెద్దగా పేరు అయితే రాలేదు కానీ…అరా..కొరా సినిమాతో బాగానే నటించింది. అయితే అదే క్రమంలో అనుకోకుండా ఆమెను పోలీసులు ఒక స్టార్ హోటెల్ లో “వ్యభిచారిణిగా” అరెస్ట్ చేశారు…..ఎర్రమంజిల్ కోర్టు ఆదేశాలతో రెస్క్యూ హోంకు తరలించటం.. తర్వాత నాంపల్లి కోర్టు క్లీన్ చిట్ ఇవ్వటం లాంటివి ఒకటి తర్వాత ఒకటిగా చక….చకా జరిగిపోయాయి. అనంతరం ఆమె తన ఊరికి వెళ్లిపోయారు. ఇదంతా జరిగి దాదాపు రెండేళ్లు అవుతోంది.

అయితే ఈ మధ్య ఒక మీడియా ఛానెల్ వారికి ఇచ్చిన ఇంటెర్వ్యులో అసలు విషయాన్ని బయట పెట్టింది శ్వేత బసు…అసలు ఆ రోజు ఏం జరిగిందో చెబుతూ…సంతోషం సినీ వార పత్రిక అవార్డుల్లో పాల్గొనటానికి ముంబయి నుంచి వచ్చిన ఆమె.. తర్వాత తాను వెళ్లాల్సిన ఫ్లైట్ మిస్ అయ్యారు. దీంతో.. ఆమెకు ఒక ఫైవ్ స్టార్ హోటల్లో అకామిడేషన్ ఇచ్చారు. అదే సమయంలో పోలీసులు దాడి చేయటం.. అరెస్ట్ చేయటం లాంటివి జరిగిపోయాయని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా నిజానిజాలు తెలుసుకోకుండా తనపై దుష్ప్రచారం చేసిన టీవీ చ్యానెల్స్ పై శ్వేత మాట్లాడుతూ…‘‘నాకు సంబంధం లేని విషయాల్లో కూడా నా పేరుని లాగుతున్నారంటే నేను పాపులర్ అని అర్థం. నా పేరు స్పెల్లింగ్ బాగుందనీ.. నా ఫోటోలు బాగున్నాయని అర్థం అని అంటూనే….మీడియా నాకు సపోర్ట్ గా ఉంది అని ఒక మెలిక పెట్టి వదిలేశారు…ఏది ఏమైనా…చిన్న వయసులోనే ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేసింది ఈ బ్యూటీ.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus