Shyam Singha Roy Collections: నాని సినిమాకి మంచి ఓపెనింగ్సే నమోదయ్యాయి..కానీ..!

Advertisement

ఎన్నో ప్రతికూల నడుమ క్రిస్మస్ కానుకగా నిన్న విడుదల అయ్యింది నాని హీరోగా నటించిన శ్యామ్ సింగ రాయ్ చిత్రం. సాయి పల్లవి, కృతి శెట్టి హీరోయిన్లుగా టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం అందించగా వెంకట్ బోయినపల్లి నిర్మించాడు. టీజర్, ట్రైలర్, పాటలు సినిమా పై మంచి అంచనాలే క్రియేట్ చేశాయి. అందుకు తగ్గట్టే మొదటి రోజు ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది. కలెక్షన్లు కూడా బాగానే నమోదయ్యాయి కానీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ పెద్దది కాబట్టి ఇవి ఓ మోస్తారు కలెక్షన్లు మాత్రమే అని చెప్పాలి.

ఒకసారి ఫస్ట్ డే కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 2.18 cr
సీడెడ్ 0.65 cr
ఉత్తరాంధ్ర 0.51 cr
ఈస్ట్ 0.20 cr
వెస్ట్ 0.16 cr
గుంటూరు 0.26 cr
కృష్ణా 0.18 cr
నెల్లూరు 0.12 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 4.26 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 1.30 Cr
ఓవర్సీస్ 1.35 Cr
వరల్డ్ వైడ్ (టోటల్) 6.91 cr

శ్యామ్ సింగ రాయ్ చిత్రాన్ని చాలా వరకు నిర్మాతలే ఓన్ రిలీజ్ చేసుకున్నారు. అయినప్పటికీ ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.30 కోట్ల షేర్ ను రాబట్టాలి. మొదటిరోజు ఈ చిత్రం రూ.6.91 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కు మరో రూ.23.09 కోట్ల షేర్ ను రాబట్టాలి. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన కక్ష్య సాధింపు చర్యల కారణంగా ఈ చిత్రం కలెక్షన్ల పై పెద్ద ఎఫెక్ట్ పడింది. అయినప్పటికీ ఇవి తీసి పారేసే కలెక్షన్లు మాత్రం కాదు. అయితే బ్రేక్ ఈవెన్ టార్గెట్ పెద్దది కాబట్టి ఇవి ఆర్డినరీ ఓపెనింగ్స్ అనాల్సి వస్తుంది.

శ్యామ్ సింగరాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

83 సినిమా రివ్యూ & రేటింగ్!
వామ్మో.. తమన్నా ఇన్ని సినిమాల్ని మిస్ చేసుకుండా..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus