తెలుగు-తమిళ ఫ్యాన్స్ వార్ కు బలైపోయిన సిద్ధార్థ్

నోరు మంచిదైతే.. ఊరు మంచిదవుతుంది అనేది పాత సామెత.. నోరు మంచిదైనా సోషల్ మీడియా పచ్చి బూతులు తిడుతుంది అనేది కొత్త జనరేషన్ సామెత. ఈ సామెతకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ సిద్ధార్థ్. నిన్న “అసురన్” తెలుగు రీమేక్ “నారప్ప” ఫస్ట్ లుక్ విడుదలైన సందర్భంలో ధనుష్ ఫ్యాన్స్ వెంకటేష్ ను ట్రోల్ చేయడం మొదలెట్టేసరికి.. తెలుగు హీరోల అభిమానులందరూ వెంకటేష్ & ఆయన లుక్స్ ను డిఫెండ్ చేయడం మొదలెట్టారు. ఈ రచ్చ ఏ స్థాయికి వెళ్ళిందంటే.. తెలుగు ఫ్యాన్స్ అందరూ ట్విట్టర్లో “తెలుగు రియల్ హీరోస్”, తమిళ హీరోల అభిమానులు “అన్ రేవల్డ్ తమిళ్ హీరోస్” అని మరో హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేయడం మొదలెట్టారు. ఈ గొడవ ఎంత పరాకాష్టకి వెళ్ళిందంటే.. చెన్నై & హైద్రాబాద్ లో ఈ ట్రెండ్ టాప్ 1లో నిలిచేంత.

ఈ విషయంలో ఇరు హీరోల అభిమానులు పెద్దగా రెస్పాండ్ అవ్వకపోయినా.. సిద్ధార్థ్ మాత్రం “వెస్ట్ ఆఫ్ ఇంటర్నెట్” అని యువతను ఏదైనా పనికొచ్చే పని చేసుకొండ్రా అని చిన్న మొట్టికాయ వేశాడు. అంతే ఇంక తెలుగు-తమిళ హీరోస్ ఇద్దరూ కలిసి సిద్ధార్థ్ ను ట్విట్టర్ తో తిట్టడం మొదలెట్టారు. ట్రోలింగ్ నుండి బూతులు తిట్టడం వరకూ సాగుతూనే ఉంది.

 

సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!
ఎంత మంచివాడవురా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus