అక్టోబర్ లో సిద్దార్ధ్ గృహ ప్రవేశం!

అప్పుడెప్పుడో తెలుగు-తమిళంలో ఏకకాలంలో రూపొందిన “సంధింగ్ సంధింగ్” తర్వాత “కళావతి” అనే తమిళ అనువాద చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన లవర్ బోయ్ ఇమేజ్ ఓనర్ సిద్దార్ధ్ ఆ తర్వాత నిర్మాతగా మారి తమిళంలో “జిల్ జంగ్ జాక్” అనే ప్రయోగాత్మక చిత్రాన్ని నిర్మించడంతోపాటు కథానాయకుడిగానూ నటించాడు. ఆ సినిమా బాక్సాఫీసు వద్ద దారుణంగా ఫెయిల్ అవ్వడంతో కాస్త విరామం ఇచ్చి మళ్ళీ తానే నిర్మాతగా సైలెంట్ ఓ సినిమా మొదలెట్టి షూటింగ్ మొత్తం పూర్తయ్యాక టైటిల్ తో ప్రేక్షకులను పలకరించాడు సిద్దార్ధ్.

తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రూపొందిన ఈ చిత్రానికి హిందీలో “హౌస్ నెక్స్ట్ డోర్” అనే టైటిల్ ఫిక్స్ చేయగా.. తెలుగులో “గృహం” అనే టైటిల్ ను నిర్ణయించి ఇవాళ తన ట్విట్టర్ ఎకౌంట్ ద్వారా ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశాడు. మరి ఈ సినిమాతోనైనా సిద్ధార్ధ్ తన పూర్వ వైభవాన్ని పొందుతాడో లేదో చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus