మలయాళంలో సిద్ధార్థ్ ఎంట్రీ!

  • January 30, 2018 / 07:08 AM IST

చాలాకాలం తర్వాత “గృహం” చిత్రంతో తెలుగుతోపాటు తమిళ, హిందీ భాషల్లోనూ మంచి హిట్ అందుకొన్న సిద్ధార్థ్ ప్రస్తుతం మలయాంలో ఓ సినిమా చేస్తున్నాడు. “కుమార సంభవం” అనే మలయాళ చిత్రంతో మాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు సిద్ధార్ధ్. పరిచయమవ్వడం వరకూ బాగానే ఉంది కానీ.. మనోడు మాలీవుడ్ ఎంట్రీ కోసం కలిసి నటిస్తున్నది ఎవరితో అనే విషయం తెలిస్తే మాత్రం షాక్ అవుతారు. ఇటీవలే పెళ్లి చేసుకొని హ్యాపీగా హనీమూన్ కి వెళ్ళిన భావన కిడ్నాప్ కేసులో ప్రధాన నిండుతుడైన దిలీప్ కుమార్ తో. భావన కేసు విషయంలో అరెస్ట్ అయ్యి ఇటీవలే బయటకొచ్చిన దిలీప్ నటిస్తున్న సినిమా ఇది.

రితీష్ అంబట్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. తమిళంలోనూ ఈ చిత్రాన్ని విడుదల చేద్దామనుకొంటున్నారు. సో దిలీప్ నటిస్తుండడం వల్ల ఈ చిత్రానికి మలయాళంతోపాటు తమిళంలోనూ విపరీతమైన క్రేజ్ ఏర్పడడం సహజం. మరి ఆ క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొనే సిద్ధార్ధ్ ఈ సినిమా ఒప్పుకున్నాడో ఏమో తెలియదు కానీ.. ఆ సినిమాలో సిద్ధార్ధ్ ఫస్ట్ లుక్ ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది. నున్నగా నూని రాసి వెనక్కి దువ్విన జుట్టు, మెలేసీన మీసాలు, పీక బొత్తం పెట్టి చేతిలో మందు గ్లాసు పట్టుకొని విలన్ లుక్ లో కనిపిస్తున్నాడు సిద్ధార్ధ్, మరి అతడి పాత్రకు విలనీ షేడ్స్ ఏమైనా ఉన్నాయో లేదో తెలియాలంటే సినిమా రిలీజ్ వరకూ ఆగాల్సిందే.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus