ఇప్పుడంటే సిద్దార్థ్ ను తెలుగు ప్రేక్షకులు మర్చిపోయారు కానీ.. గతంలో ఇతనికి కూడా తెలుగులో మంచి క్రేజ్ ఉంది. సిద్ధార్థ్ సినిమాలకు గతంలో రూ.10 కోట్ల వరకు మార్కెట్ ఉండేది. అయితే వరుస ప్లాప్ లు రావడంతో సిద్దార్థ్ ఫేడౌట్ అయిపోయాడు. అయితే 8 ఏళ్ళ తర్వాత అతను తెలుగులో ఓ స్ట్రైట్ మూవీలో నటించబోతున్న సంగతి తెలిసిందే. అదే ‘మహాసముద్రం’.2018 వ సంవత్సరంలో ‘ఆర్.ఎక్స్.100’ వంటి బ్లాక్ బస్టర్ ను అందించిన దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కిస్తోన్న చిత్రమిది.
అయితే ఈ చిత్రంలో మెయిన్ హీరోగా శర్వానంద్ నటిస్తుండగా సెకండ్ హీరో పాత్రలో సిద్దార్థ్ కనిపించబోతున్నాడు. ఇదిలా ఉండగా.. ఈ చిత్రం కోసం సిద్దార్థ్ మంచి పారితోషికం అందుకున్నట్టు వార్తలు వస్తున్నాయి.అందుతున్న సమాచారం ప్రకారం.. ‘మహాసముద్రం’ కు గాను సిద్ధార్థ్ రూ.3 కోట్ల పారితోషికం తీసుకుంటున్నాడట. తమిళంలో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేయాలనే ఉద్దేశంతో ఇతను అడిగినంత నిర్మాతలు ఇచ్చినట్టు వినికిడి. ఈ సినిమా కనుక హిట్ అయితే సిద్దార్థ్ కు ఇలాంటి మంచి పాత్రలు టాలీవుడ్లో మరిన్ని వచ్చే అవకాశం ఉంది.
ఇక అనిల్ సుంకర తన ‘ఎ.కె ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా…అదితి రావు హైదరి,అనూ ఇమాన్యుల్ వంటి క్రేజీ భామలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఆగష్టు 19న విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. కానీ కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ కారణంగా వాయిదా పడింది.