అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ఆరంభించి “బాయ్స్” సినిమాతో హీరోగా పరిచయమైన సిద్దార్థ్ “మంచి నటుడు” అనే విషయం ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. అతడు ప్రధాన పాత్ర పోషించిన హిందీ చిత్రం “రంగ్ దే బసంతి” చూస్తే సరిపోతుంది.. ఒక నటుడిగా ఎన్ని వేరియేషన్స్ పండించగలడో.. నిజానికి ఆ సినిమాలో హీరో అమీర్ ఖాన్ అయినప్పటికీ.. సిద్ధార్హ్ అతడ్ని డామినేట్ చేశాడు. అంతటి స్టామినా కలిగిన సిద్దార్ధ్ తర్వాత “నువ్వోస్తానంటే నేనోద్దంటానా, బొమ్మరిల్లు” చిత్రాలతో వరుస హిట్స్ అందుకొని స్టార్ హీరోగా వెలుగొందుతాడు అనుకొంటున్న తరుణంలో “ఆట, ఓయ్, కొంచెం ఇష్టం కొంచెం కష్టం, బావ, అనగనగా ఓ ధీరుడు, 180, ఓ మై ఫ్రెండ్, జబర్దస్త్” లాంటి వరుస పరాజయాలతో వెనుకబడిపోయాడు. మధ్యలో “లవ్ ఫెయిల్యూర్, ఎన్ హెచ్ 4, జిగర్తాండ (తెలుగులో “చిక్కడు దొరకడు”) వంటి యావరేజ్ అండ్ ఎబౌ యావరేజ్ హిట్స్ వచ్చినప్పటికీ సదరు సినిమాల సక్సెస్ క్రెడిట్ ఆ సినిమా డైరెక్టర్ లేదా సినిమాలో సపోర్టింగ్ రోల్ పోషించిన ఆర్టిస్ట్ ఎకౌంట్ లో పడడం వల్ల సిద్ధార్ధ్ ఎకౌంట్ జీరో అయిపోయింది.
దాంతో.. ఇక సిద్దార్ధ్ పని అయిపోయింది అని అందరూ అనుకొంటున్న తరుణంలో “అవల్” (తెలుగులో “గృహం”)తో సూపర్ హిట్ కొట్టి తన ఉనికిని ఘనంగా చాటుకొన్నాడు సిద్దార్ధ్. తెలుగులో ఈవారం (నవంబర్ 10) విడుదలవుతున్న “గృహం”పై విశేషమైన అంచనాలున్నాయి. ప్యూర్ హారర్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం తమిళనాట సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకొంది. ఈవారం తెలుగులోనూ విడుదలై ఘన విజయం సాధించడం ఖాయమని సిద్దార్ధ్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. ఈ చిత్రానికి సిద్దార్ధ్ కథ-స్క్రీన్ ప్లే విభాగాల్లోనూ పనిచేయడం విశేషం. మరి సిద్దార్ధ్ కమ్ బ్యాక్ హిట్ అనంతరం అతడి కెరీర్ ఎలా ఉంటుందో చూడాలి.