సమంతను మిస్ చేసుకున్నందుకు బాధపడుతున్న సిద్దార్ధ

మనకి ఒక వస్తువుపై ఇష్టం అది అందనంత వరకు 100 శాతం ఉంటే దానిని దక్కించుకోగానే ఇష్టం 30 శాతానికి పడిపోతుంది. అదే వస్తువు దూరమయితే ఇష్టం 100 శాతానికి పెరుగుతుంది.  ప్రేమ విషయంలోనూ ఇది నిజమని తాజా అధ్యయనంలో తేలింది. హీరో సిద్దార్ధ బ్రేకప్ లవ్ స్టోరీ తెలుసుకుంటే ఆ సర్వే చెప్పిన సంగతి వాస్తవమని మీరు అంగీకరిస్తారు. అసిస్టెంట్ డైరక్టర్ గా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన సిద్దార్ధ్ బాయ్స్ చిత్రం ద్వారా హీరో గా మారాడు. అదే ఏడాది మేఘ్న అనే అమ్మాయిని పెళ్లిచేసుకున్నాడు. కొంతకాలం కలిసిఉన్న వీరిద్దరూ 2007 లో విడాకులు తీసుకున్నారు.

ఒంటరిగా మారిన సిద్దూకి జబర్దస్త్ సినిమా ద్వారా సమంత పరిచయమైంది. ఆ పరిచయం కాస్త ప్రేమ గా మారి చెట్టా పట్టాలేసుకొని తిరిగారు. మొదట్లో సిద్దూ స్యామ్ పై విపరీతమైన ప్రేమ చూపించాడు. అతనికి సమంత బోర్ కొట్టడానికి రెండేళ్లు కూడా కాలేదు. ఎనక్కుళ్ వరువాల్ అనే తమిళ సినిమాలో కో స్టార్ గా నటించిన దీపా సన్నిధి వైపు సిద్దార్ధ గాలి మళ్లింది. సమంతను పట్టించుకోకుండా దీపా చుట్టూ తిరుగుతుండడంతో ఆమె హర్ట్ అయింది. లవ్ కి బ్రేకప్ చెప్పింది. అప్పటివరకు ఫ్రెండ్ గా ఉన్న నాగచైతన్యతో లవ్ లో పడింది. ఆ ప్రేమ సక్రమంగా సాగి పెళ్లి వైపు తీసుకువెళ్ళింది. మొదట్లో సమంత దూరమవ్వడాన్ని పెద్దగా ఫీలవ్వని సిద్ధూ, ఇప్పుడు మాత్రం తెగ బాధపడిపోతున్నాడంట. తానే స్వయంగా  స్యామ్ ని మిస్ చేసుకున్నానని మిత్రులతో వాపోతున్నట్లు తెలిసింది. అందుకే అందింది కదా అని వస్తువునైనా, వ్యక్తి ప్రేమనైనా చులకనగా చూడకూడదని స్నేహితులు హితబోధ చేసినట్లు సమాచారం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus