మరోసారి సత్తా చాటిన ‘మహానటి’ ‘రంగస్థలం’ చిత్రాలు

  • August 16, 2019 / 01:18 PM IST

దక్షణాది సినిమాలకి ప్రతిస్టాత్మకంగా ఇచ్చే ‘సైమా’ అవార్డుల వేడుక తాజాగా జరిగింది. వివిధ కేటగిరీల్లో మంచి నటన కనపరిచిన నటీ నటులకు, సాంకేతిక నిపుణులకు… ప్రతి ఏడాది ‘సైమా’ అవార్డుల ప్రధానోత్సవం జరుగుతుంటుంది. ‘ఖతార్‌’ లో ఈ వేడుక ఘనంగా జరిగింది. మొన్నటికి మొన్న నేషనల్ అవార్డుల్లో సత్తా చాటిన ‘మహానటి’ ‘రంగస్థలం’ చిత్రాలకి మరోసారి అవార్డుల పంట పండింది. అయితే ‘రంగస్థలం’ చిత్రానికి అవార్డు మిస్సయినా ‘సైమా’ అవార్డు మాత్రం రాంచరణ్ నే వరించింది. ‘మహానటి’ చిత్రానికి గాను మరోసారి కీర్తి సురేష్ ఉత్తమ నటి కేటగిరిలో అవార్డు కొట్టేసింది. ఇక సైమా అవార్డుల లిస్ట్ ఈ విధంగా ఉంది :

1) బెస్ట్ ఫిలిం : మహానటి (వైజయంతి మూవీస్)

2) బెస్ట్ డైరెక్టర్ : సుకుమార్(రంగస్థలం)

3) బెస్ట్ యాక్టర్ (male) : రాంచరణ్

4) బెస్ట్ క్రిటిక్స్ అవార్డు : విజయదేవరకొండ (గీత గోవిందం)

5) బెస్ట్ యాక్టర్ (female) : కీర్తి సురేష్

6) బెస్ట్ క్రిటిక్స్ (female) : సమంత (రంగస్థలం)

7) బెస్ట్ సపోర్టింగ్ రోల్ : రాజేంద్ర ప్రసాద్ (మహానటి)

8)బెస్ట్ సపోర్టింగ్ రోల్ (female) : అనసూయ (రంగస్థలం)

9) బెస్ట్ కమెడియన్ : సత్య (ఛలో)

10) బెస్ట్ లిరిక్ రైటర్ : చంద్రబోస్ (ఏంత సక్కగున్నావే ‘రంగస్థలం’)

11)బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ : అనురాగ్ కులకర్ణి (పిల్లా రా ‘ఆర్.ఎక్స్.100)

12)బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ (female) : ఎం.ఎం.మానసి

13) బెస్ట్ డెబ్యూ యాక్టర్ : కళ్యాణ్ దేవ్

14) బెస్ట్ డెబ్యూ యాక్టర్ (female) : పాయల్ రాజ్ పుత్

15) బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ : అజయ్ భూపతి (ఆర్.ఎక్స్.100)

16) బెస్ట్ సినిమాటోగ్రఫర్ :రత్నవేలు (రంగస్థలం)

17) బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్ : రామకృష్ణ (రంగస్థలం)

18) మోస్ట్ పాపులర్ యాక్టర్ (in social media ) : విజయ్ దేవరకొండ

19 .బెస్ట్ ఆక్టర్ (నెగటివ్ రోల్) : శరత్ కుమార్ (నా పేరు సూర్య)

20. బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ – దేవి శ్రీ ప్రసాద్ (రంగస్థలం)

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus