దక్షిణాదిన ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే సైమా(సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్) వేడుక కరోనా కారణంగా మూడేళ్లుగా నిర్వహించలేకపోతున్నారు. అయితే 2019 ఏడాదికి సంబంధించి ‘సైమా’ పురస్కారాల ప్రధానోత్సవాలను ఈ ఏడాది నిర్వహించనున్నారు. ఈ మేరకు ‘సైమా’ ఛైర్ పెర్సన్ బృందా ప్రసాద్ ఒక ప్రకటన విడుదల చేశారు. రాబోయే సెప్టెంబర్ లో పురస్కార ప్రదానోత్సవం ఉంటుందని ఆమె తెలిపారు. ఈసారి నామినేట్ అయిన సినిమాలు ఇండస్ట్రీలకు ఒక బీచ్ మార్క్ ను నిర్ధేశించాయని చెప్పారు.
అత్యంత ఆదరణ పొందిన చిత్రాలుగా మహర్షి(తెలుగు), అసురన్(తమిళం), యజమాన(కన్నడ), కుంబళంగి నైట్స్(మలయాళం) చిత్రాలు నామినేషన్ లో ముందంజలో నిలిచాయి. మహేష్ బాబు నటించిన ‘మహర్షి’ పది నామినేషన్స్ తో ఫస్ట్ ప్లేస్ లో ఉండగా.. ‘మజిలీ’ తొమ్మిది, ‘జెర్సీ’ ఏడు నామినేషన్స్ తో రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. తమిళంలో ధనుష్ హీరోగా నటించిన ‘అసురన్’ సినిమాకి పది నామినేషన్లు, కార్తీ నటించిన ‘ఖైదీ’ ఎనిమిది నామినేషన్లతో ఉన్నాయి.
మళయాలంలో అయితే ఫహద్ ఫాజిల్ నటించిన ‘కుంబళంగి నైట్స్’ సినిమాకి అయితే ఏకంగా 13 నామినేషన్లు వచ్చాయి. కన్నడ సినిమా ‘యజమాన’కి 12 నామినేషన్లు వచ్చాయి. ఆన్ లైన్ ఓటింగ్ ద్వారా విజేతలను నిర్ణయించనున్నారు.
Most Recommended Video
నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!