Sikandar Review in Telugu: సికందర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • సల్మాన్ ఖాన్ (Hero)
  • రష్మిక మందన్న, కాజల్ అగర్వాల్ (Heroine)
  • షర్మాన్ జోషి, సత్యరాజ్, ప్రతీక్ బబ్బర్ (Cast)
  • ఏ.ఆర్.మురుగదాస్ (Director)
  • సాజిద్ నడియాడ్ వాలా (Producer)
  • ప్రీతమ్ - సంతోష్ నారాయణన్ (Music)
  • తిరు (Cinematography)
  • Release Date : మార్చ్ 30, 2025

వరుస డిజాస్టర్లతో కాస్త నెమ్మదించిన సల్మాన్ ఖాన్ (Salman Khan), సరైన హిట్ లేక చతికిలపడ్డ ఏ.ఆర్.మురుగదాస్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం “సికందర్”. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంపై కనీస స్థాయి అంచనాలు లేవు. అందుకు కారణం సినిమా ప్రమోషనల్ కంటెంటే. అయితే.. ఇవాళ విడుదలైన ఈ చిత్రం హెచ్.డి ప్రింట్ తెల్లవారుజామునే లీక్ అవ్వడం అనేది చర్చనీయాంశం అయ్యింది. మరి సినిమా సంగతేంటి? సల్మాన్ & మురుగదాస్ ఎట్టకేలకు హిట్ కొట్టారా లేదా అనేది చూద్దాం..!!

Sikandar Review

కథ: రాజ్ కోట్ మహారాజు సంజయ్ అలియాస్ సికందర్ (సల్మాన్ ఖాన్) భార్య సాయిశ్రీ (రష్మిక మందన్న) అనుకోని విధంగా చనిపోవడంతో.. ముంబై వెళ్తాడు. అక్కడ ఓ ముగ్గురిని ఆదుకోవడానికి అస్సలు వెనుకాడడు.

ఆ ముగ్గురు ఎవరు? సికందర్ ఎందుకని వాళ్ళని కాపాడడానికి వెనుకాడడు? ముంబైలో మినిస్టర్ ప్రధాన్ ఎందుకని సికందర్ ను చంపడానికి ప్రయత్నిస్తాడు? వంటి ప్రశ్నలకు సమాధానం “సికందర్” చిత్రం.

నటీనటుల పనితీరు: సల్మాన్ ఖాన్ తనలోని ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ ను మరోసారి ప్రేక్షకుల్ని పరిచయం చేయడానికి ప్రయత్నించాడు. నిజానికి సల్మాన్ ను ఈ తరహా పాత్రలో అస్సలు ఊహించం. ఎమోషనల్ సీన్స్ లో సల్మాన్ ఖాన్ పర్వాలేదనిపించుకోగా.. యాక్షన్ సీన్స్ లో మాత్రం తనదైన ప్రెజన్స్ & స్టైల్ తో అలరించాడు.

రష్మిక మందన్న మరోసారి హీరో భార్య పాత్రలో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది కానీ.. సల్మాన్ & రష్మిక నడుమ కెమిస్ట్రీ సరిగా వర్కవుట్ అవ్వలేదు. దాంతో.. ఆమె కనిపించే ప్రతీ సన్నివేశం సినిమాకి అడ్డంకిగానే మారింది.

కాజల్ అగర్వాల్ ను మరీ క్యారెక్టర్ రోల్ కి పరిమితం చేయడం అనేది బాధాకరం.

సత్యరాజ్ ను రొటీన్ విలన్ గా ప్రొజెక్ట్ చేసారు. అందువల్ల ఆ పాత్ర అంతగా పండలేదు.

ఇక మిగతా పాత్రల్లో షర్మాన్ జోషి, ప్రతీక్ బబ్బర్, కిషోర్ తదితరులు పర్వాలేదనిపించుకున్నారు.

సాంకేతికవర్గం పనితీరు: సంతోష్ నారాయణన్ బ్యాగ్రౌండ్ స్కోర్ & కొన్ని యాక్షన్ బ్లాక్స్ తప్ప సినిమాలో చెప్పుకోదగ్గ టెక్నికాలిటీ ఏమీ లేదు. తీరు సినిమాటోగ్రఫీ వర్క్ కూడా సరైన డి.ఐ చేయకపోవడంతో ఎలివేట్ అవ్వలేదు.

యాక్షన్ బ్లాక్స్ మాత్రం సల్మాన్ ఫ్యాన్స్ ను అలరిస్తాయి. ముఖ్యంగా ధారావి ఫైట్ సీన్ & ఫ్లైట్ లో ఇంట్రడక్షన్ ఫైట్ బాగా వర్కవుట్ అయ్యాయి.

దర్శకుడు మురుగదాస్ ఒక సాదాసీదా కథను లాజిక్స్ ను గాలికొదిలేసి తెరకెక్కించిన విధానం సినిమాకి పెద్ద మైనస్. లక్షల కోట్ల అధిపతి, అది కూడా పార్లమెంట్ తో డైరెక్ట్ కాంటాక్ట్స్ ఉన్న వ్యక్తి.. ధారావిలో ఫైట్స్ చేయాల్సిన అవసరం ఏముంది, టెర్రరిస్ట్ గా మోస్ట్ వాంటెడ్ అంటూ పోలీసులు వెతుకున్న ఒక వ్యక్తి చాలా సరదాగా ముంబై రోడ్ల మీద ట్యాక్సీలో తిరుగుతూ ఉంటాడు. ఇక మినిస్టర్ ఇంటికెళ్లి చాలా సింపుల్ గా మూడు గుద్దులతో అతడ్ని చంపేస్తాడు.

కమర్షియల్ సినిమాల్లో లాజిక్స్ చూడకూడదు అనేది కరెక్ట్ కానీ, కనీసం కామన్ సెన్స్ కూడా ఉండదా అనిపించింది. స్క్రీన్ ప్లే అనేది ఇష్టం వచ్చినట్లుగా నడుస్తుంటుంది. అసలు కథకు సంబంధం లేని పాత్రలు, కథనంతో పట్టింపు లేని పాత్రలు వచ్చిపోతుంటాయి. ఒకప్పుడు సెన్సిబుల్ & లాజికల్ సినిమాలు తెరకెక్కించిన మురుగదాసేనా ఇలాంటి సిల్లీ యాక్షన్ సినిమా తీసింది అనిపించకమానదు. ఓవరాల్ గా దర్శకుడు మురుగదాస్ మరోసారి మెప్పించలేకపోయాడు.

విశ్లేషణ: సల్మాన్ ఖాన్ సినిమాల్లో లాజిక్స్ కాదు సల్మాన్ ఖాన్ ను చూడడానికి మాత్రమే వస్తారు అనేది నిజమే. అయితే.. సల్మాన్ ఖాన్ చేసే ఫైట్స్ బాగున్నా, ఆ ఫైట్స్ ఎందుకు చేస్తున్నాడు అనే రీజన్ & ఎమోషన్ సరిగా వర్కవుట్ అవ్వకపోతే సల్మాన్ ఖాన్ రెండొందల మందిని ఉతికి ఆరేసినా ఆడియన్స్ ఎంజాయ్ చేయలేరు. ఎమోషనల్ కనెక్ట్ అనేది కనీస స్థాయి వర్కవుట్ అవ్వక “సికందర్” అనేది ఓ సగటు సినిమాగా మిగిలిపోయింది.

ఫోకస్ పాయింట్: సల్మాన్ ఇమేజ్ కి తగ్గ సినిమా కాదు మురుగా!

రేటింగ్: 2/5

Rating

2
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus