జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), ఎస్.ఎస్.రాజమౌళి (S. S. Rajamouli) కలయికలో ‘స్టూడెంట్ నెంబర్ 1’ (Student No: 1) వంటి సూపర్ హిట్ మూవీ తర్వాత వచ్చిన చిత్రం ‘సింహాద్రి’ (Simhadri) . ‘వి.ఎం.సి ప్రొడక్షన్స్’ బ్యానర్ పై వి.విజయ్ కుమార్ వర్మ (V. Vijay Kumar Varma) , వి.దొరస్వామిరాజు (V. Doraswamy Raju) కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు.భూమిక (Bhumika Chawla) అంకిత (Ankita Jhaveri) హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి (M. M. Keeravani) సంగీతం అందించారు. 2003, జూలై 9న ఈ సినిమా రిలీజ్ అయ్యింది. ఎవ్వరూ ఊహించని విధంగా సరికొత్త రికార్డులు సృష్టించింది. రీ రిలీజ్ లో కూడా భారీ కలెక్షన్స్ ని సాధించింది.
మరి బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఫైనల్ గా ఎంత కలెక్ట్ అనే విషయాన్ని తెలుసుకుందాం రండి :
నైజాం | 7.17 cr |
సీడెడ్ | 6.03 cr |
ఉత్తరాంధ్ర | 2.55 cr |
ఈస్ట్ | 1.89 cr |
వెస్ట్ | 1.77 cr |
గుంటూరు | 2.36 cr |
కృష్ణా | 2.02 cr |
నెల్లూరు | 1.37 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 25.16 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 3.07 Cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 28.23 cr |
‘సింహాద్రి’ మొదట రూ.11.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది.ఫుల్ రన్లో రూ.25.40 కోట్ల షేర్ ను రాబట్టి…బయ్యర్స్ కి రూ.13.9 కోట్ల లాభాలను అందించింది. రీ రిలీజ్ తో కలుపుకుంటే ఈ సినిమా మొత్తంగా రూ.28.23 కోట్ల షేర్ ను రాబట్టింది అని చెప్పాలి.