NTR, Manoj: ఎన్టీఆర్, మనోజ్ ల గురించి మనం గమనించని కొన్ని సిమిలారిటీస్..!

మొన్నామధ్య అల్లు శిరీష్ ది ఓ సినిమా వచ్చింది. ‘ఒక్క క్షణం’ అని..! ప్యారలల్ లైఫ్ ల కథాంశంతో దర్శకుడు వి.ఐ.ఆనంద్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. సురభి ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించింది.నిజ జీవితంలో అలా ఇద్దరి కుర్రాళ్ళ జీవితాలు సిమిలర్ గా ఉంటాయా అనే డౌట్ అందరికీ వస్తుంది. దానికి బెస్ట్ ఎగ్జామ్పుల్ గా మన ఎన్టీఆర్, మంచు మనోజ్ లను చెప్పుకోవచ్చు.వీళ్ళు నిజజీవితంలో కూడా బెస్ట్ ఫ్రెండ్స్ అన్న సంగతి తెలిసిందే.అయితే జూనియర్ ఎన్టీఆర్, మంచు మనోజ్ జీవితాల్లో చాలా సిమిలారిటీస్ చాలా ఉన్నాయి.

అవేంటో తెలుసుకుందాం రండి :

1) 1983వ సంవత్సరం మే 20 వ తేదీనే వీళ్ళిద్దరూ జన్మించారు. కొన్ని గంటల ముందు ఎన్టీఆర్ జన్మించాడు.

2) ఎన్టీఆర్, మనోజ్ ఇద్దరూ కూడా సినిమా కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు.

3) 1991లో రూపొందిన ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ సినిమా ద్వారా ఎన్టీఆర్ బాలనటుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించింది పెద్ద ఎన్టీఆర్. అలాగే మంచు మనోజ్ కూడా ‘మేజర్ చంద్ర కాంత్’ సినిమా ద్వారా బాలనటుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇందులో కూడా పెద్ద ఎన్టీఆర్ ప్రధాన పాత్ర పోషించాడు.

4) ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ సినిమాల్లో నటించడమే కాకుండా ఎంపీగా కూడా చేశారు. మనోజ్ తండ్రి మోహన్ బాబు కూడా ఎన్నో సినిమాల్లో నటించాడు అలాగే ఈయన కూడా ఎంపీగా చేసాడు.

5) ఎన్టీఆర్ వివాహం 2011వ సంవత్సరం మే నెలలో లక్ష్మీ ప్రణతితో జరిగింది. ఇక మనోజ్ వివాహం 2015 వ సంవత్సరం మే నెలలో జరిగింది. మనోజ్ భార్య పేరు కూడా ప్రణతినే కావడం విశేషం. అయితే కొన్ని కారణాల వల్ల మనోజ్ తన భార్యతో విడిపోయాడు.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus