Sing Geetham Collections: ‘సింగ్ గీతం’ వసూళ్లపై ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్
- June 24, 2026 / 06:30 AM ISTByPhani Kumar
సింగీతం శ్రీనివాసరావు.. ఈ పేరుకి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ‘పుష్పక విమానం’ ‘భైరవద్వీపం’ ‘ఆదిత్య 369’ వంటి ఎన్నో టైమ్ లెస్ క్లాసిక్ సినిమాలు అందించారు. విజినరీ డైరెక్టర్ అని కూడా అనొచ్చు. అలాంటి గొప్ప దర్శకుడు 94 ఏళ్ళ వయసులో కూడా ఓ సినిమా తీయడం అంటే చిన్న విషయం కాదు. అదే ‘సింగ్ గీతం'(Sing Geetham). నాగ్ అశ్విన్ నిర్మాణ సారధ్యంలో ‘వైజయంతీ మూవీస్’ సంస్థ పై ఈ చిత్రం రూపొందింది.
Sing Geetham

జూన్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ చిత్రం. మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. కానీ బాక్సాఫీస్ వద్ద సొ సొ ఓపెనింగ్స్ మాత్రమే వచ్చాయి. ఒకసారి 10 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :
| నైజాం | 1.78 cr |
| సీడెడ్ | 0.32 cr |
| ఆంధ్ర(టోటల్) | 1.12 cr |
| ఏపీ +తెలంగాణ(టోటల్) | 3.22 cr |
| రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్(తెలుగు వెర్షన్) | 1.18 cr |
| వరల్డ్ వైడ్ టోటల్ | 4.4 cr |
‘సింగ్ గీతం’ చిత్రాన్ని చాలా వరకు ఓన్ రిలీజ్ చేసుకున్నారు మేకర్స్. అయితే బాక్సాఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ కోసం రూ.6 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. 10 రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా కేవలం రూ.4.4 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.1.6 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 2వ వీకెండ్లో ‘మా ఇంటి బంగారం’ ‘దీవానా’ వంటి సినిమాలతో పాటు ‘పెద్ది’ కూడా పోటీగా ఉండటం వల్ల అనుకున్న స్థాయిలో క్యాష్ చేసుకోలేకపోయింది ‘సింగ్ గీతం’















