ప్రముఖ నటి ఆకాంక్ష దుబే మార్చ్ 26న ఓ హోటల్ గదిలో ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు విడిచిన సంగతి తెలిసిందే. ఈమెది సాధారణ హత్య కాదు అన్నట్టు పోలీసులు అనుమానాలు వ్యక్తం చేశారు. ఎందుకంటే ఆకాంక్ష దుబే పోస్ట్ మార్టం రిపోర్ట్ లో సంచలన విషయాలు బయటపడ్డాయి. ఆకాంక్ష కడుపులో 20 మిల్లీ లీటర్ల గుర్తు తెలియని లిక్విడ్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అలాగే ఆమె మణికట్టుపై కూడా గాయాలు ఉన్నాయని వైద్యులు చెప్పినట్లు తెలిపారు.
దీంతో ఆకాంక్ష దుబే మృతి వెనుక చాలా మిస్టరీ ఉందని పోలీసులు భావించి దాన్ని ఓ మిస్టరీ మర్డర్ కేసుగా దర్యాప్తు చేపట్టారు. తాజాగా పోలీసులు సింగర్ సమర్ సింగ్ ను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. అలాగే సీసీ టీవీ ఫుటేజ్ లో కూడా కొన్ని కీలక విషయాలు బయటపడ్డాయని తెలుస్తుంది. ఆకాంక్ష చనిపోయే ముందు ఓ వ్యక్తితో ఉన్నట్టు సీసీ టీవీ ఫుటేజ్ లో తేలింది. ఆ ఫుటేజ్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
ఇక భోజ్ పురి నటి (Actress) అయిన ఆకాంక్ష చనిపోయే ముందు షూటింగ్ నిమిత్తం వారణాసి వెళ్లడం జరిగింది. అక్కడ ఓ హోటల్ లో బస చేస్తూ షూటింగ్లో పాల్గొనేది. మార్చ్ 26న రోజులానే షూటింగ్ పూర్తిచేసుకుని రూమ్ కు వచ్చిన ఆకాంక్ష అనుమాన స్థితిలో మరణించి పడుంది. చనిపోయే ముందు ఆమె ఓ వ్యక్తితో ఉంది. అందుకు సంబంధించిన సీసీటీవీ విజువల్స్ పోలీసులు సేకరించించడం జరిగింది.
ఆ వ్యక్తికి ఆకాంక్షకు మధ్య ఉన్న సంబంధం ఏంటి అన్న విషయం పై ఇప్పుడు పోలీసులు హోటల్ సిబ్బందిని విచారిస్తున్నట్లు సమాచారం. అతను హోటల్ కు వచ్చే ముందు ఎంట్రీ బుక్ లో ఎంటర్ చేసిన డీటెయిల్స్ గురించి పోలీసులు ఆరా తీసినట్టు కూడా తెలుస్తుంది.