Chinmayi, Shrihan: శ్రీహాన్ వీడియోపై సింగర్ చిన్మయి రియాక్షన్.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్..

సినిమాల ప్రభావం జనాల మీద ఎంతుందో తెలియదు కానీ పంచ్ డైలాగుల ప్రభావం మాత్రం బాగా ఉంది అని ఓ సినిమాలో చెప్పినట్టు.. సెల్ ఫోన్, సోషల్ మీడియా అనేవి సామాన్య జనాల జీవితంలో ఓ భాగమైపోయాయి.. మీడియా ముందు మాట్లాడేటప్పుడు కానీ, సోషల్ మీడియాలో ఏదైనా ఒక పోస్ట్ చేసేటప్పుడు కానీ సెలబ్రిటీలు చాలా జాగ్రత్తగా ఉండాలి.. లేదంటే తర్వాత ట్రోలింగ్ తట్టుకోవడం కష్టం.. ఇప్పుడలాంటి ట్రోలింగ్స్ ఎదుర్కొంటూ నెట్టింట వార్తల్లో నిలిచారు శ్రీహాన్ – సిరి హన్మంత్..

వివరాల్లోకి వెళ్తే.. బిగ్‌బాస్‌ సీజన్‌ 6లో కంటెస్టెంట్స్ అయిన సిరి-శ్రీహాన్‌లు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. కొద్ది రోజులుగా వీరు ఒక బాబుని పెంచుకుంటున్నారు.. ఆ బాబు పేరు చైతు.. మాట వినకుండా అల్లరి చేస్తున్న కొడుకుని బెదిరించడం కోసం.. శ్రీహాన్ తనను తాను బెల్ట్‌తో కొట్టుకుంటునట్టు యాక్ట్ చేశాడు.. ‘‘ఎన్నిసార్లు చెప్పాలి.. నామాట వింటావా.. లేదా?’’ అని అరుస్తూ.. బెల్ట్‌తో కొట్టుకుంటునట్టు నటించగా.. చైతూ..

‘‘నీ మాట వింటా డాడీ.. కొట్టుకోవద్దు.. సారీ’’ అంటూ ఏడుస్తాడు.. దీనినంతటిని సిరి వీడియో తీస్తుంటుంది.. చైతు మాటలకు నవ్వుతుంది కూడా.. ఈ వీడియోని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో.. అది కాస్తా వైరల్ అవుతోంది..పాపులర్ సింగర్‌ కమ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద ఈ వీడియోపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘మనకు మనం హాని చేసుకోవడం అనేది పిల్లల మనసుపై తీవ్ర ప్రభావం చూపుతుంది.. చాలా మంది తల్లిదండ్రులు..

పిల్లలు తమ మాట వినకపోతే, తాము చెప్పినట్లు నడుచుకోకపోతే.. వారిని బెదిరించడం కోసం తమను తాము కొట్టుకుంటారు.. చనిపోతామని బెదిరిస్తారు.. వాళ్లు చూసిన సంబంధం చేసుకోకపోతే ఆత్మహత్య చేసుకుంటామని బెదిరిస్తారు.. దీనికి కనీసం ఈ జనరేషన్‌లో అయినా ముగింపు పలకాలి’’ అంటూ పోస్ట్‌ చేసింది.

దీనిపై నెటిజన్లు రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.. శ్రీహాన్‌ ఫ్యాన్స్‌ చిన్మయి మీద ఫైరవుతున్నారు.. ‘‘వాళ్లేదో సరదాగా చేసిన వీడియో అది.. దాన్నంత సీరియస్‌గా తీసుకుంటున్నారెందుకు?’’.. అని కొందరు.. ‘‘పిల్లల ముందు మనకు మనం ఇలా హాని చేసుకోవడం చాలా తప్పు.. పిల్లల్ని ఇలాగే పెంచుతారా?’’ అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..

8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus