సినీ ఇండస్ట్రీలో సింగర్ గా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి సింగర్ చిన్మయి తనకు అవకాశం దొరికిన ప్రతిసారి తమిళ ప్రముఖ రచయిత వైరముత్తు పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తూ ఉంటారు. గతంలో మీటు ఉద్యమం సమయంలో ఈమె రచయిత వైరముతో తీవ్రస్థాయిలో Laiగిక ఆరోపణలు చేస్తున్నారంటూ అతనిపై మండిపడ్డారు. తన గురించి వ్యతిరేకంగా మాట్లాడటంతో చిన్మయిపై ఎన్నో కేసులు పెట్టడమే కాకుండా తమిళ చిత్ర పరిశ్రమ తనని బ్యాన్ కూడా చేశారు.
చిత్ర పరిశ్రమకు దూరంగా ఉన్నటువంటి ఈమె (Chinmayi) తనకు అవకాశం దొరికిన ప్రతిసారి అక్కడ రాజకీయ నాయకులను అలాగే రచయిత వైర ముత్తు పై తీవ్ర స్థాయిలో మండిపడుతూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ పై కూడా అదే స్థాయిలో విమర్శలు కురిపించారు. వైరు ముత్తు పుట్టినరోజు సందర్భంగా స్వయంగా సీఎం స్టాలిన్ ఆయన ఇంటికి వెళ్లి తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన ఫోటోని ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ Laiగిక ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి ఇంటికి వెళ్లి మీరు ఎలా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతారు అంటూ ప్రశ్నించారు. అటువంటి వారితో కలిసి కూడా మీరు కూడా నమ్మకం కోల్పోతారని ఈమె తెలియజేశారు. మీ టు ఉద్యమంలో భాగంగా ఆయన పై ఆరోపణలు చేసినందుకు ఐదు సంవత్సరాలుగా నాపై తమిళ చిత్ర పరిశ్రమ బ్యాన్ విధించింది నేను ఎంతో నరకం అనుభవిస్తున్నాను అంటూ ఈమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ క్రమంలోనే ఇలా Laiగిక వేధిస్తున్నటువంటి వ్యక్తి గురించి ఎవరూ మాట్లాడకూడదని ఎవరు అడ్డు చెప్పకూడదని రాజకీయ నాయకులను సంప్రదిస్తున్నారని మండిపడ్డారు. అంతేకాకుండా ఇలాంటి ఓ వ్యక్తికి పద్మ అవార్డులు జాతీయ పురస్కారాలు ఎలా వస్తున్నాయి ఇదంతా ప్రభుత్వ ప్రమేయంతోనే జరుగుతుంది అంటూ ఈ సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రిపై ఈమె మండిపడుతూ చేసినటువంటి ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.
‘జవాన్’ ట్రైలర్ పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్!
ఇప్పటికీ రిలీజ్ కి నోచుకోని 10 క్రేజీ సినిమాల లిస్ట్..!
ఈ వీకెండ్ కి ధియేటర్/ఓటీటీలో రిలీజ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్..!