Chinmayi: వైరముత్తు విషయంలో స్టాలిన్ పై ఫైర్ అయిన సింగర్!

  • January 2, 2024 / 10:09 PM IST

సింగర్ గా డబ్బింగ్ ఆర్టిస్టుగా సౌత్ ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో చిన్మయి ఒకరు. అయితే ఈమెను కోలీవుడ్ ఇండస్ట్రీలో బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. ప్రముఖ రచయిత వైరముత్తు పట్ల ఈమె ఆరోపణలు చేయడంతో కోలీవుడ్ చిత్ర పరిశ్రమ ఈమెను బ్యాన్ చేశారు. వైరుముత్తు తనని లైంగికంగా వేధించారు అన్న ఆరోపణలు చేయడంతో ఈమె పైనే కోలీవుడ్ చిత్ర పరిశ్రమ వేటు వేసింది. అప్పటినుంచి కోలీవుడ్ ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి చిన్మయి తనకు జరిగిన అన్యాయం గురించి ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూనే వస్తున్నారు.

అయితే తాజాగా మరోసారి వైరుముత్తు విషయంలో ఈమె తమిళనాడు ముఖ్యమంత్రి పై కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ వరుస ట్వీట్స్ చేశారు. ప్రస్తుతం ఈమె చేస్తున్నటువంటి ఈ ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా రచయిత వైరుముత్తు రాసిన మహా కవితై పుస్తకావిష్కరణ ఇటీవల చెన్నైలో జరిగింది.ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకుడు పి.చితంబరం తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, కమల్ హాసన్ వంటి ప్రముఖులు హాజరయ్యారు అయితే ఈ కార్యక్రమానికి స్టార్ సెలబ్రిటీలందరూ కూడా రావడంతో ఈమె ఆగ్రహం వ్యక్తం చేస్తూ వరుస ట్వీట్స్ చేశారు.

తనని లైంగికంగా వేధించి తన కెరియర్ నాశనం అయ్యేలా చేసినటువంటి వైరుముత్తుకి తమిళనాడులోని మోస్ట్ పవర్ ఫుల్ మెన్ సపోర్ట్ చేస్తున్నారని బాధపడ్డారు. తనకు ఎప్పుడు న్యాయం జరుగుతుందోనని ఈమె ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈమె తనకు సమయం దొరికినప్పుడల్లా రచయిత వైరముత్తు పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంటారు. ఇక ఈ వేడుకకు స్టాలిన్ వంటి ప్రముఖులు కూడా రావడంతో ఈమె (Chinmayi) తమిళనాడు ముఖ్యమంత్రి పై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus