Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Singer Mangli: బళ్లారి ఘటనపై స్పందించిన సింగర్‌ మంగ్లీ.. అందుకే చేశారంటూ!

Singer Mangli: బళ్లారి ఘటనపై స్పందించిన సింగర్‌ మంగ్లీ.. అందుకే చేశారంటూ!

  • January 23, 2023 / 11:35 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Singer Mangli: బళ్లారి ఘటనపై స్పందించిన సింగర్‌ మంగ్లీ.. అందుకే చేశారంటూ!

ఆదివారం సాయంత్రం మీడియా, సోషల్‌ మీడియాలో ఒకటే చర్చ… ప్రముఖ గాయని మంగ్లీ కారు మీద బళ్లారిలో రాళ్ల దాడి జరిగింది అని. దీంతో ఏమైందా అంటూ ఆరా తీయడం మొదలుపెట్టారు చాలామంది. ఆ మాట ఆ నోట, ఈ నోట ఆఖరికి మంగ్లీ దగ్గరకు వెళ్లింది. దీంతో ఆమె ఈ విషయమై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ పెట్టారు. దాడి వార్తలను ఖండించిన మంగ్లీ అదంతా తప్పుడు ప్రచారమని చెప్పారు. తన ప్రతిష్టను కించపరచటానికి ఇదంతా చేస్తున్నారని తెలిపారు.

‘‘శనివారం రాత్రి బళ్లారిలో జరిగిన ఓ కార్యక్రమంలో నాపై దాడి జరిగిందనే వార్తలను ఖండిస్తున్నాను. కొన్ని సోషల్ మీడియా గ్రూపుల్లో ఈ మేరకు నా పై ప్రచారం చేస్తున్న తప్పుడు వార్తలను పూర్తిగా అబద్దం. ఈవెంట్‌ అంతా చక్కగా జరిగింది. నేను పాల్గొన్న ఉత్తమ ఈవెంట్‌లలో ఇదొకటి. నాపై కన్నడ ప్రజలు చూపించిన ప్రేమ, ఇచ్చిన మద్దతు చాలా గొప్పది. ఈవెంట్‌లో నన్ను అందరూ బాగా చూసుకున్నారు. ఇలాంటి సమయంలో నాపై దాడి జరిగిందంటూ అనడం నా ప్రతిష్టను కించపరచడానికి చేస్తున్న పనే’’ అని సోషల్‌ మీడియాలో మంగ్లీ రాసుకొచ్చారు.

బళ్లారి మున్సిపల్ కళాశాల మైదానంలో శనివారం బళ్లారి ఫెస్టివల్ వైభవంగా జరిగింది. ఈ వేడుకల్లో సీనియర్ నటుడు రాఘవేంద్ర రాజ్‌కుమార్, పునీత్ రాజ్‌కుమార్ భార్య అశ్విని తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మొదటి రోజు ఉత్సవంలో మంగ్లీ, మరికొంతమంది గాయకులు పాల్గొన్నారు. మంగ్లీ తిరిగి వెళ్లేటప్పుడు ఆమెను చూసేందుకు స్థానిక యువకులు ఎగబడ్డారు. వేదిక వెనుక ఉన్న మేకప్ టెంట్ లోపలికి మంగ్లీ వెళ్లినప్పుడు అందులోకి కొంతమంది ప్రవేశించారని,

దీంతో పోలీసులు లాఠీచార్జి చేశారని తొలుత వార్తలు వచ్చాయి.ఆ తర్వాత కార్యక్రమం నుండి మంగ్లీ తిరిగి వెళ్లిపోయేటప్పుడు కొంత మంది స్థానిక యువకులు ఆమె కారుపై రాళ్లతో దాడి చేశారని ఆ వార్తల సారాంశం. అయితే అవన్నీ అవాస్తవమని ఇప్పుడు కొట్టిపారేశారు.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mangli
  • #mangli singer
  • #Singer Mangli

Also Read

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

Peddi: ‘పెద్ది’ లో ఐటమ్ సాంగ్… శృతి హాసన్ పారితోషికం ఎన్ని కోట్లో తెలుసా?

Peddi: ‘పెద్ది’ లో ఐటమ్ సాంగ్… శృతి హాసన్ పారితోషికం ఎన్ని కోట్లో తెలుసా?

Payal Rajput: వెక్కి వెక్కి ఏడ్చిన పాయల్.. వీడియో వైరల్

Payal Rajput: వెక్కి వెక్కి ఏడ్చిన పాయల్.. వీడియో వైరల్

related news

Mangli: నాకు పాటలే తెలుసు.. స్కామ్‌లు తెలియవు.. ఎమోషనల్‌ అయిన మంగ్లీ

Mangli: నాకు పాటలే తెలుసు.. స్కామ్‌లు తెలియవు.. ఎమోషనల్‌ అయిన మంగ్లీ

Mangli : నాడు జానపదాల నుంచి మొదలైన ప్రస్థానం.. నేడు వివాదాల ఉచ్చుల్లో మంగ్లీ !

Mangli : నాడు జానపదాల నుంచి మొదలైన ప్రస్థానం.. నేడు వివాదాల ఉచ్చుల్లో మంగ్లీ !

Mangli: మంగ్లీపై కేసు నమోదు.. తిరిగి కేసు పెట్టిన సింగర్‌.. ఏమవుతోంది?

Mangli: మంగ్లీపై కేసు నమోదు.. తిరిగి కేసు పెట్టిన సింగర్‌.. ఏమవుతోంది?

trending news

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

2 hours ago
‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

2 hours ago
Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

15 hours ago
Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

15 hours ago
Peddi: ‘పెద్ది’ లో ఐటమ్ సాంగ్… శృతి హాసన్ పారితోషికం ఎన్ని కోట్లో తెలుసా?

Peddi: ‘పెద్ది’ లో ఐటమ్ సాంగ్… శృతి హాసన్ పారితోషికం ఎన్ని కోట్లో తెలుసా?

1 day ago

latest news

Pooja Hegde: పూజా హెగ్డే డేటింగ్ కహానీ

Pooja Hegde: పూజా హెగ్డే డేటింగ్ కహానీ

20 hours ago
Disco Shanti: ‘మగధీర’ లో శ్రీహరిని షేర్ ఖాన్ పాత్ర చేయొద్దు అని చెప్పాను : డిస్కో శాంతి

Disco Shanti: ‘మగధీర’ లో శ్రీహరిని షేర్ ఖాన్ పాత్ర చేయొద్దు అని చెప్పాను : డిస్కో శాంతి

21 hours ago
Faria Abdullah : మతాలపై ఫరియా అబ్దుల్లా కామెంట్స్ వైరల్ ! ఏమందంటే ?

Faria Abdullah : మతాలపై ఫరియా అబ్దుల్లా కామెంట్స్ వైరల్ ! ఏమందంటే ?

23 hours ago
Toxic Movie : మళ్ళీ వాయిదా పడ్డ ‘టాక్సిక్’.. అసలు ప్రాబ్లమ్ ఏంటంటే ?

Toxic Movie : మళ్ళీ వాయిదా పడ్డ ‘టాక్సిక్’.. అసలు ప్రాబ్లమ్ ఏంటంటే ?

1 day ago
Peddi vs Lenin : లెనిన్ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసిన నాగార్జున.. పెద్దితో పోటీ అవసరమా ?

Peddi vs Lenin : లెనిన్ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసిన నాగార్జున.. పెద్దితో పోటీ అవసరమా ?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version