భీమ్లా నాయక్ సినిమాలో పాట పాడటం ద్వారా మొగులయ్య ఫేమస్ అయిన సంగతి తెలిసిందే. అంతకుముందే మొగులయ్యకు గుర్తింపు ఉన్నప్పటికీ పవన్ సినిమాకు పాట పాడటంతో మొగులయ్య ప్రేక్షకులకు సుపరిచితులయ్యారు. మొగులయ్య 12 మెట్ల కిన్నెరపై స్వరాలను పలికించడం ద్వారా ఊహించని స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్నారు. దేశ అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటైన పద్మశ్రీ అవార్డు మొగులయ్యను వరించిన సంగతి తెలిసిందే. తన ప్రతిభ వల్ల మొగులయ్య ఈ అవార్డుకు ఎంపికయ్యారు.
అయితే ఏడాది క్రితం వరకు మొగులయ్య ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. భీమ్లా నాయక్ పాట పాడిన తర్వాత మొగులయ్య ఆర్థిక స్థితి గురించి తెలిసి పవన్ కళ్యాణ్ 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేసిన సంగతి తెలిసిందే. మొగులయ్యకు కేంద్రం పద్మశ్రీ పురస్కారం ఇచ్చి గౌరవించడంతో ఆయన అభిమానులు కూడా సంతోషిస్తున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన మొగులయ్య తాను చాలా పేదవాడినని 1,000 రూపాయలు లేకపోవడం వల్ల తన భార్య చనిపోయిందని అన్నారు.
తిండి లేక తన భార్య చనిపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని మొగులయ్య చెప్పుకొచ్చారు. భార్య శవాన్ని తీసుకెళ్లడానికి కూడా తన దగ్గర డబ్బులు లేకపోతే ఆ సమయంలో కేవీ రమణాచారి 10,000 రూపాయల సాయం చేశారని మూడు సంవత్సరాల క్రితం భార్య చనిపోయిందని మొగులయ్య తెలిపారు. నాకు మొత్తం తొమ్మిది మంది పిల్లలని ఒక కొడుకు గుండెలో నీరొస్తే హైదరాబాద్ కు తీసుకెళ్లాలని డాక్టర్లు సూచించారని మొగులయ్య చెప్పుకొచ్చారు. 500 రూపాయలు లేక తన కొడుకు కూడా చనిపోయాడని మొగులయ్య తన కన్నీటి కష్టాలను చెప్పుకొచ్చారు.
కిన్నెర కళను బ్రతికించాలని తన కోరిక అని మొగులయ్య పేర్కొన్నారు. ఇతర ప్రాంతాలకు వెళ్లాలని అనుకుంటే ఎవరైనా డబ్బులు ఇచ్చి సహాయం చేసేవారని మొగులయ్య చెప్పుకొచ్చారు. మొగులయ్య చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మొగులయ్యకు మరిన్ని సినిమా అవకాశాలు దక్కితే ఆయన కెరీర్ పుంజుకుంటుందని చెప్పవచ్చు.
Most Recommended Video
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!