Singer: సింగర్ కు తృటిలో తప్పిన ప్రమాదం.!

సామాన్యులకు మాత్రమే కాదు.. రాను రాను సెలబ్రిటీలకు భద్రత లేకుండా పోతుంది. దీనికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. కొన్నాళ్ల క్రితం మోహన్ బాబు స్టార్ ఇంట్లోకి ఓ కారు దూసుకురావడం, అందులో ఉన్న వ్యక్తులు మోహన్ బాబుని చంపేస్తాం అంటూ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అలాగే సల్మాన్ ఖాన్ ను చంపేస్తాం అంటూ ఎప్పటికప్పుడు బెదిరింపు కాల్స్ వస్తూనే ఉన్నాయి. మొన్నటికి మొన్న షారుఖ్ ఇంట్లో ఇద్దరు అజ్ఞాత వ్యక్తులు అక్రమంగా చొరబడ్డారు.

అలాగే ఇటీవల హీరోయిన్ డింపుల్ హయాతి ఇంట్లోకి కూడా ఓ అమ్మాయి, అబ్బాయి గుట్టుగా చొరబడిన సంగతి తెలిసిందే. ఇలాంటివి ఇంకా చాలానే ఉన్నాయి. ఇదిలా ఉండగా.. తాజాగా ఓ సింగర్ కు బుల్లెట్ గాయం అవ్వడం అందరికీ పెద్ద షాకిచ్చినట్టు అయ్యింది. వివరాల్లోకి వెళితే.. భోజ్ పురి ఫోక్ సింగర్ నిషా ఉపాధ్యాయ… బీహార్ లోని పాట్నాలో ఓ సాంస్కృతిక కార్యక్రమంలో లైవ్ ఫెర్మామెన్స్ ఇస్తుండగా.. కాల్పులు జరిగాయట. ఈ క్రమంలో ఆమెకు బుల్లెట్ గాయాలైనట్లు తెలుస్తోంది.

నిషా (Singer) ఎడమ తొడకు బుల్లెట్ తగిలినట్లు పోలీసులు వెల్లడించారు. తర్వాత అక్కడున్నవారు ఆమెను పాట్నాలోని మాక్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతున్నట్లు వినికిడి.ఆమె ప్రాణానికి ఎటువంటి హాని లేదు. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందట. ఇక ఈ ఘటనపై పోలీసులు స్పందిస్తూ.. “మాకు ఈ కాల్పుల గురించి సమాచారం అందింది కానీ, లిఖిత పూర్వకమైన ఫిర్యాదు అందలేదు. అందువల్ల ఈ కార్యక్రమంలో తుపాకీ కాల్పులు ఎలా జరిగాయి? ఎవరు కాల్చారు? ఎవరిని లక్ష్యంగా చేసుకుని కాల్పులు చేశారు.. అనే విషయంపై స్పష్టత లేదు” అంటూ వారు చెప్పుకొచ్చారు.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus