టాలీవుడ్ స్టార్ సింగర్ సునీత.. కరోనా లాక్ డౌన్ మొదలైనప్పటి నుండీ ఏదో ఒకరకంగా వార్తల్లో నిలుస్తూ వచ్చారు. మొదట ఈమె మేనల్లుడిని అని చెప్పుకుని.. ఓ కుర్రాడు ఇండస్ట్రీలో చాలా మంది దగ్గర డబ్బులు వసూల్ చేసి పరారయ్యాడు. ఆ టైములో సునీత.. ‘అలాంటి వారితో జాగ్రత్తగా ఉండండి.. ఇండస్ట్రీలో నాకు మేనల్లుడు ఎవ్వరూ లేరు’ అని క్లారిటీ ఇచ్చింది. అటు తరువాత ‘ఈమె రెండో పెళ్లి చేసుకుంటుంది’ అని వార్తలు వచ్చాయి.
కానీ వాటిలో నిజం లేదని సునీత చెప్పింది. అయితే సడెన్ గా ప్రముఖ మీడియా సంస్థ అధినేత అయిన రామ్ వీరపనేనితో ఎంగేజ్మెంట్ చేసుకుని అందరికీ షాకిచ్చింది. ‘పెళ్లి వయసుకి దగ్గర పడిన పిల్లలను పెట్టుకుని ఈ టైములో రెండో పెళ్లికి రెడీ అవ్వడమేంటి?’ అని కొంతమంది సునీత పై విమర్శలు గుప్పిస్తున్నా.. అది ఆమె వ్యక్తిగత నిర్ణయం కాబట్టి.. అలా కామెంట్లు చెయ్యడం సరికాదనే చెప్పాలి. సరే ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే.. తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సునీత ..
అటు తరువాత మీడియాతో మాట్లాడి తన పెళ్లి డేట్ ను ప్రకటించింది. ‘వచ్చే నెల..అంటే వచ్చే సంవత్సరం జనవరి 9న తాను వివాహాం చేసుకోబోతున్నట్టు’ తెలిపింది.’నా నూతన జీవితం బాగుండాలని తిరుమల వేంకటేశుని ప్రార్ధించా… కరోనా కారణంగా గత తొమ్మిది నెలలుగా శ్రీవారి దర్శనానికి దూరమయ్యాను… ఇప్పుడు వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది’ అంటూ సునీత చెప్పుకొచ్చారు. ఇక పెళ్లి కూడా కొద్దిపాటి బంధుమిత్రుల సమక్షంలోనే చేసుకోబోతున్నట్టు ఆమె తెలిపింది.
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
Most Recommended Video
2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!