Singer Sunitha: మంచి కూతురికి తల్లి అయినందుకు గర్వంగా ఉంది: సునీత

టాలీవుడ్ ప్లేబ్యాక్ సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న గాయని సునీతకు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఈమెకు హీరోయిన్ రేంజ్ పాపులారిటీ ఉంది. ముఖ్యంగా తన అద్భుతమైన గాత్రంతో పాటలు వింటూ ఎంతో మంది తమని తాము మైమరచి పోతుంటారు. ఈ విధంగా సునీత గాయనిగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు.ఇకపోతే సునీత రెండో పెళ్లి తర్వాత సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని అభిమానులతో పంచుకుంటున్నారు.

ఈ క్రమంలోనే తన పిల్లల గురించి కూడా సునీత ఎంతో గొప్పగా చెబుతూ గర్వంగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇప్పటికే తన కొడుకు ఆకాష్ ను హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేయాలని సునీత తాపత్రయపడుతున్నారు. మరోవైపు తన కూతురు శ్రేయను సింగర్ గా ఇండస్ట్రీకి పరిచయం చేయాలని భావిస్తున్నారు. శ్రేయ ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా పాటలు పాడుతూ ఉన్న వీడియోలను షేర్ చేస్తూ ఈమె కూడా ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నారు.

తాజాగా సునీత కూతురు శ్రేయ పుట్టినరోజు జరుపుకోవడంతో తన కూతురిని తలచుకొని సునీత ఎమోషనల్ అయ్యారు. ఈ క్రమంలోనే తన కూతురుతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేస్తూ తన కూతురి బర్త్ డే సూపర్ డూపర్ బర్త్ డే అని తన కూతురు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని చెప్పుకొచ్చారు.ఇలాంటి ఎంతో మంచి మనసున్న కూతురికి తాను తల్లి అయినందుకు చాలా గర్వపడుతున్నానని ఈ సందర్భంగా సునీత ఎమోషనల్ అయ్యారు.

ఈ విధంగా కూతురు పుట్టినరోజు సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్ట్ చేయడంతో ఈ పోస్ట్ క్షణాల్లో వైరల్ గా మారడమే కాకుండా తన కూతురుతో కలిసి దిగిన ఫోటోలు కూడా వైరల్అవుతున్నాయి.ఈ పోస్టు చూసిన సునీత అభిమానులు సైతం పెద్ద ఎత్తున తన కూతురికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక సునీత మొదటి భర్తతో విడిపోయిన చాలా సంవత్సరాలపాటు ఒంటరిగా పిల్లల బాధ్యతలను చూసుకుంటూ, తన పిల్లల ఇష్టప్రకారం మ్యాంగో మీడియా అధినేత రామ్ ను రెండవ వివాహం చేసుకున్నారు.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus