ఏడో తరగతిలోనే అమ్మకు లవ్ మ్యాటర్ తెలుసు : యశస్వి
- April 16, 2021 / 10:49 AM ISTByFilmy Focus
జీ తెలుగు ఛానల్ లో ప్రసారమైన సరిగమప నెక్స్ట్ ఐకాన్ ప్రోగ్రామ్ కు విన్నర్ గా నిలిచి తెలుగు రాష్ట్రాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు సింగర్ యశస్వి కొండేపూడి. సాధారణ కంటెస్టెంట్ గా సరిగమప ప్రోగ్రామ్ లో అడుగుపెట్టిన కాకినాడకు చెందిన యశస్వి జాను మూవీలోని లైఫ్ ఆఫ్ రామ్ పాటను అద్భుతంగా పాడి స్టార్ సింగర్ అయ్యారు. లైఫ్ ఆఫ్ రామ్ పాట తర్వాత యశస్వికి భారీగా క్రేజ్ పెరిగింది.
పాటలతో పాటు ప్రేమకథతో కూడా యశస్వి పాపులర్ అయ్యారు. సరిగమప స్టేజ్ పైనే తన లవర్ ను యశస్వి తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం చేశారు. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన లవ్ స్టోరీ గురించి యశస్వి చెప్పుకొచ్చారు. సింగర్ కాకపోయి ఉంటే ఏమయ్యేవారనే ప్రశ్నకు పైలట్ అవ్వాలని అనుకున్నానని యశస్వి చెప్పారు. ప్రేమించిన అమ్మాయి జాను కోసం ఇంటర్ లో ఎంపీసీ కాకుండా బైపీసీ తీసుకున్నానని యశస్వి తెలిపారు.

తాను మొత్తం 7 స్కూళ్లు మారానని అందులో జాను కోసమే మూడు స్కూళ్లు మారానని యశస్వి వెల్లడించారు. చిన్నప్పుడు స్కూల్ బాలేదని చెప్పి స్కూల్ మారానని యశస్వి తెలిపారు. చిన్నప్పటి నుంచి ఇంట్లో వాళ్లు తాను డాక్టర్ కావాలని అనుకున్నారని ఇంటర్ లో బైపీసీ తీసుకోవడంతో వాళ్లు చాలా సంతోషించారని యశస్వి చెప్పారు. ఏడో తరగతి చదివే సమయంలోనే అమ్మకు తను జానుతో ప్రేమలో ఉన్నాననే విషయం తెలుసని యశస్వి పేర్కొన్నారు.
అమ్మానాన్నలది కూడా లవ్ మ్యారేజ్ అని యశస్వి చెప్పుకొచ్చారు. జీ తెలుగు స్టేజ్ పై పరిచయం చేస్తానని చెబితే ఇంట్లో వాళ్లు వద్దని చెప్పారని కానీ ప్రేమించి పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని పరిచయం చేయడంలో తప్పేం ఉందని భావించి తాను స్టేజ్ పైనే లవర్ ను పరిచయం చేశానని యశస్వి పేర్కొన్నారు.
Most Recommended Video
‘వకీల్ సాబ్ ‘ నుండీ ఆకట్టుకునే 17 పవర్ ఫుల్ డైలాగులు!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!















