ఒక్క రోజులో ఎన్నో జరగవచ్చు…అయితే ఆ ఒక్కరోజులో జరిగిన వాటిల్లో మంచి చెడు, ఆనందం, విషాదం ఇలా అనేక రకాలు ఉండవచ్చు. అయితే ఒక్కరోజులో ఏమయిపోతుందిలే అనే వారికి ఆ ఒక్కరోజులోనే అనేక జ్ఞాపకాలను మనం పదిలం చేసుకోవచ్చు అని చెప్పవచ్చు. అయితే మరి అలాంటి ఒక్కరోజులో జరిగిన ఇన్సిడెంట్స్ ను కధగా తయారు చేసి, ఇంకా చెప్పాలి అంటే సింగిల్ డే కధలను సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరిస్తే ఎంత బావుంటుందో కధా…అయితే అలా సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కృతం అయిన కొన్ని సింగిల్ డే కధలను ఒక లుక్ వేద్దాం రండి…
ప్రయాణం:మంచు మనోజ్ హీరోగా, పాయల్ గోష్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి తెరకెక్కించాడు. అయితే ఈ సినిమా మంచి ఫీల్ గుడ్ మూవీగా అందరినీ ఆకట్టుకుంది. అయితే ఒక ఏర్‌పోర్ట్ లో హీరో హీరోయిన్ మధ్య జరిగే కధగా ఈ సీనియమా తెరకెక్కడం విశేషం.
మొదటి సినిమా:నవదీప్ హీరోగా, పూనం బజ్వా హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమా కూచి పూడి వెంకట్ దర్శకత్వంలో తెరకెక్కింది. అయితే ఈ సినిమా కధ ఒక మంచి లవ్ స్టోరీ గా తెరకెక్కి, ప్రేక్షకులను ఆకట్టుకుంది.
డేంజర్:స్వాతి, అల్లరి నరేశ్, ముఖ్య పాత్రల్లో, ప్రముఖ దర్శకుడు కృష్ణ వంశీ తెరకెక్కించిన ఈ సినిమా కధ చాలా సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. ఒక ఫ్రెండ్ పార్టీకి వెళ్లే క్రమంలో అనుకోను సంఘటన చూసిన ఒక ఫ్రెండ్స్ బ్యాచ్ అక్కడనుంచి జరిగే పరిణామాలు అన్నీ వెరసి ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంది.
దొంగల ముఠా:టాలీవుడ్ చరిత్రలో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రయోగాత్మకంగా తెరకెక్కించిన ఈ చిత్రంలో హీరోగా రవితేజ నటించాడు. పెద్ద పెద్ద తారలు ఎందరో ఉన్న ఈ చిత్రం కేవలం నాలుగు రోజుల్లోనే తెరకెక్కించడం విశేషం. అయితే ఈ సినిమాతో అతి తక్కువ బడ్జెట్ లో సినిమా తియ్యవచ్చు అని వర్మ నిరూపించుకునే ప్రయత్నం చేశాడు.
ఈనాడు:టాలీవుడ్ టాప్ హీరో వెంకటేష్, తమిళ కధానాయకుడు కమల్ హసన్ కలసి చేసిన బాలీవుడ్ రీమేక్ ‘వెడ్‌నెస్‌డే’ తెలుగులో ఈనాడుగా రిలీజ్ అయ్యింది. ఒక డిఫరెంట్ ప్లాట్ తో ఈ సినిమా తెరకెక్కించాడు దర్శకుడు నీరజ్ పాండే. బాక్స్ ఆఫీస్ వద్ద మంచి హిట్ అనుకుంది ఈ సినిమా.
సరోజ:ప్రముఖ హాలీవుడ్ సినిమా ‘జడ్జ్మెంట్ నైట్’ కధను ఆధారంగా చేసుకుని ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో పెద్ద పెద్ద తారలు ఎందరో ఉన్నారు. అదే క్రమంలో ఈ సినిమాని దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కించాడు.
భలే మంచి రోజు: ప్రిన్స్ మహేష్ రీలేషన్ సుధీర్ బాబు ప్రత్యేక పాత్రలో నటించిన ఈ సినిమా ఒక లవ్ రివెంజ్ డ్రామా గా తెరక్కింది. అయితే ఈ సినిమాతో శ్రీరామ్ ఆదిత్య దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయం అయ్యాడు.
అమీ తుమీ:ప్రముఖ దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణ డైరెక్ట్ చేసిన ఈ సినిమా మంచి రొమ్యాంటిక్ కామెడీ ఎంటర్‌టేనర్ గా తెరకెక్కింది. మంచి సక్సెస్ఫుల్ సినిమాగా రన్ అవుతూ ఉండడం విశేషం.
మాయ మాల్:ఒక పెద్ద మాల్ లో జరిగే ఒక హారర్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని హరి కృష్ణ అనే నిర్మాత టీవీ9 సహకారంతో తెరకెక్కించారు. గోవింద్ అనే దర్శకుడు తెరకెక్కించిన ఈ సినిమా అధ్యంతం సస్పెన్స్ తో కూడిన ట్విస్ట్స్ తో ముందుకు సాగుతుందట.