కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన బైలింగ్యువల్ మూవీ ‘సార్’. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ఈ మూవీని ‘ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్’ ‘శ్రీకర స్టూడియోస్’ తో కలిసి ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ నిర్మించాడు. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీకి జి.వి.ప్రకాష్ కుమార్ సంగీత దర్శకుడు. ‘మాస్టారు మాస్టారు’ అనే పాట అలాగే టీజర్, ట్రైలర్ లు సినిమా పై మంచి అంచనాలు ఏర్పడేలా చేశాయి.ఇక ఫిబ్రవరి 17న విడుదల అయిన ఈ మూవీ పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది.
దీంతో కలెక్షన్స్ చాలా బాగా వచ్చాయని చెప్పాలి. ఒకసారి ఫస్ట్ డే కలెక్షన్స్ ని గమనిస్తే:
నైజాం
1.01 cr
సీడెడ్
0.28 cr
ఉత్తరాంధ్ర
0.31 cr
ఈస్ట్
0.27 cr
వెస్ట్
0.11 cr
గుంటూరు
0.22 cr
కృష్ణా
0.19 cr
నెల్లూరు
0.13 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
2.51 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
1.05 cr
తమిళనాడు
3.45 cr
ఓవర్సీస్
2.02 cr
వరల్డ్ వైడ్ (టోటల్)
9.03 cr (షేర్)
‘సార్’ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.5.18 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.5.5 కోట్ల షేర్ ను రాబట్టాలి. మొదటి రోజు ఇక్కడ రూ.2.51 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కు ఇంకో రూ.2.99 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.
ఇక వరల్డ్ వైడ్ గా చూసుకుంటే ఈ మూవీకి రూ.33.58 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. అలా చూసుకుంటే ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రూ.34 కోట్లు షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి రోజు రూ.9.03 కోట్ల షేర్ ను రాబట్టింది. సో ఓవరాల్ గా ఇంకో రూ.24.55 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.