విజయ్ సేతుపతి, నిత్యా మీనన్ హీరో,హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘సార్ మేడమ్’. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా ఆగస్టు 1న రిలీజ్ అయ్యి మొదటి షోతోనే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. తమిళంలో మొదట ‘తలైవన్ తలైవి’ గా జూలై 25న విడుదలైన ఈ సినిమా ..అక్కడ సూపర్ హిట్ టాక్ తో వంద కోట్ల వసూళ్ల దిశగా దూసుకుపోతుంది. తెలుగులో పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ వల్ల కొంచెం ఆలస్యంగా రిలీజ్ అయ్యింది. పాండిరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఓపెనింగ్స్ కొంచెం పర్వాలేదు అనిపించినప్పటికీ తర్వాత డౌన్ అయ్యింది.
కింగ్డమ్, మహావతార్ నరసింహ వంటి వాటితో రీసెంట్ గా ‘అతడు’ రీ రిలీజ్ అవ్వడం వల్ల ఈ సినిమాకి ఎక్కువ స్క్రీన్స్ దక్కలేదు. ఓపెనింగ్స్ తో ఓకే అనిపించినా తర్వాత డౌన్ అయిపోయింది. 2వ వీకెండ్ ను కూడా క్యాష్ చేసుకోలేకపోయింది. ఒకసారి 11 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :
నైజాం | 0.60 cr |
సీడెడ్ | 0.28 cr |
ఆంధ్ర(టోటల్) | 0.39 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 1.27 cr(షేర్) |