బిగ్ బాస్ హౌస్ లో హౌస్ మేట్స్ కుటుంబ సభ్యులు వచ్చి వాళ్లని పలకరించడంతో పాటుగా వారికి కొన్ని హింట్స్ కూడా ఇస్తున్నారు. ఇందులో భాగంగానే కాజల్ వాళ్ల భర్త, కూతురు వచ్చినపుడు సన్నీ ఇంకా మానస్ లతో మాట్లాడుతూ ఒకరికొకరు హెల్ప్ చేస్కోవాలని, మీ ఫ్రెండ్షిప్ బాండింగ్ ఇప్పుడిప్పుడే బాగా కనెక్ట్ అయ్యిందని చెప్పాడు. అలాగే, రీసంట్ గా వచ్చిన ప్రోమోలో చూసినట్లయితే, మానస్ వాళ్ల మదర్ హౌస్ లో ఫుల్ హడావుడి చేసింది. అంతేకాదు, శ్రీరామ్ చంద్రకి, కాజల్ కి కౌంటర్స్ కూడా ఇచ్చింది.
అయితే, ఇక్కడే సిరి వాళ్ల అమ్మ వచ్చినపుడు సిరికి కొద్దిగా బుద్దులు చెప్పింది. గేమ్ బాగా ఆడుతున్నవ్ కానీ, నువ్వు షణ్ముక్ ని వెళ్లి హగ్ చేస్కోవడం నాకు నచ్చట్లేదు అని చెప్పేసరికి షణ్ముక్ షాక్ తిన్నాడు. బాగా హెల్ప్ చేస్తున్నాడు అందుకే దగ్గరైపోతోంది. నాకు అది నచ్చట్లేదు అనేసరికి అక్కడ ఫ్రీజ్ లో ఉన్న షణ్ముక్ ఎమోషనల్ అయ్యాడు. నిజానికి హౌస్ మేట్స్ ఎప్పుడూ కూడా బయట ఇది జనాలకి ఎలా వెళ్తుంది అనేదానిపైనే థింక్ చేసి మరీ గేమ్ ఆడతారు.
ఇది జెన్యూన్ అనిపిస్తుందా లేదా, మనిద్దరిదీ ఎలా జనాలు రిసీవ్ చేస్కుంటారు అనే దానిపైనే షణ్ముక్ చాలాసార్లు లెక్కలు వేశాడు. లాస్ట్ వీక్ కూడా షణ్ముక్ ఇదే విషయాన్ని సిరికి చెప్పాడు. లాస్ట్ వీక్ మనిద్దరిదీ ఇష్యూ అవ్వడం అనేది వేరే హౌస్ మేట్స్ కి ఛాన్స్ ఇచ్చినట్లుగా అయ్యిందని చెప్పాడు. ఐయామ్ ఇండివెడ్యువల్ అని రాసి మరీ సిరి పెట్టుకుంటే దాన్ని కూడా ఖండించాడు. నువ్వు ఇలా చేయడం వల్లే మనం బ్యాడ్ అవుతున్నామని చెప్పాడు. ఎప్పటికప్పుడు ఈవిషయంలో సిరిని హెచ్చరిస్తూనే ఉన్నాడు. అయినా కూడా వాళ్ల గేమ్ అలాగే ఉంది.
ఇక కాజల్ ఫ్యామీలీ వచ్చినపుడు షణ్ముక్ తనకి సంబంధించి ఎవరు వస్తారు అనేది ముందుగానే చెప్పమని మెంటల్ గా ప్రిపేర్ అవుతానని కెమెరాకి చెప్పుకున్నాడు. నిజానికి దీప్తి సునయన వస్తుందనే అనుకున్నారు అందరూ. కానీ, షణ్ముక్ మదర్ వచ్చినట్లుగా సమాచారం. దీప్తి సునయన వీకెండ్ నాగార్జునతో కలిసి స్టేజ్ పైన సందడి చేయబోతోందని టాక్ వినిపిస్తోంది. షణ్ముక్ వాళ్ల మదర్ వచ్చి కూడా షణ్ముక్ కి ఇలాగే సజెషన్ ఇచ్చినట్లుగా కూడా చెప్తున్నారు. మొత్తానికి అదీ మేటర్.