ప్రముఖ గేయ రచయిత ‘సిరి వెన్నెల’ సీతారామశాస్త్రి ఊపిరితిత్తుల క్యాన్సర్ సంబంధిత సమస్యలతో బాధ పడుతూ మంగళవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఆరు నెలల క్రితం సిరివెన్నెల సీతారామశాస్త్రి ఊపిరితిత్తుల క్యాన్సర్ బారిన పడగా వైద్యులు సగం ఊపిరితిత్తిని తొలగించారు. గత వారం మరోవైపు ఉన్న ఊపిరితిత్తులకు క్యాన్సర్ సోకగా ఆపరేషన్ చేసి మళ్లీ సగం ఊపిరితిత్తిని డాక్టర్లు తొలగించారు. డాక్టర్లు ఆపరేషన్ చేసిన తర్వాత రెండు రోజులు ఆరోగ్యంగానే ఉన్న సిరివెన్నెల సీతారామశాస్త్రి ఆ తర్వాత ఇన్ఫెక్షన్ సోకడంతో తుదిశ్వాస విడిచారు.
తనకు నచ్చిన రచయిత గురించి సిరివెన్నెల కొన్నేళ్ల క్రితం ఒక సందర్భంలో స్పందిస్తూ ప్రతి రంగంలో అందరిలో అంతా గొప్పే ఉండదని తత్వ దృష్టి కోణంలో ఆలోచిస్తే విశ్వనాథ సత్యనారాయణ అంటే ఇష్టమని తెలిపారు. ప్రతిభాపరంగా చూస్తే సి.నారాయణరెడ్డి, వేటూరి, దేవులపల్లి కృష్ణశాస్త్రి తనకు ఇష్టమని సిరివెన్నెల చెప్పుకొచ్చారు. సమకాలీకులలో అనంతశ్రీరామ్, చంద్రబోస్, భాస్కరభట్ల, రామజోగయ్యశాస్త్రి తనకు ఇష్టమని సిరివెన్నెల వెల్లడించారు. ప్రముఖ నటుడు చిరంజీవి సిరివెన్నెలను తలచుకుంటూ కంటతడి పెట్టుకున్నారు.
చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ప్రముఖ దర్శకుడు, నటుడు కె.విశ్వనాథ్ సిరివెన్నెల మృతి తీరని లోటు అని చెప్పారు. ఎస్పీ బాలు మృతితో కుడి భుజం పోయినట్లు అనిపించిందని సిరివెన్నెల మృతితో ఎడమ భుజం పోయినట్లు అనిపిస్తోందని కె.విశ్వనాథ్ వెల్లడించారు. ఏం మాట్లాడాలో తనకు అర్థం కావడం లేదని అందుకే మాట్లాడకుండా ఉన్నానని కె.విశ్వనాథ్ పేర్కొన్నారు. సిరివెన్నెల ఫ్యామిలీకి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నానని కె.విశ్వనాథ్ చెప్పుకొచ్చారు.
Most Recommended Video
టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?