వెండితెరపై ఆకట్టుకున్న అక్కాచెల్లెళ్లు

పిల్లలు చాలామంది తల్లిదండ్రులనే స్ఫూర్తిగా తీసుకుంటారు. వారి అడుగు జాడల్లో నడవడానికి ఇష్టపడుతారు. పేరెంట్స్ ఏ రంగంలో ఉన్నారో ఆ రంగంలో రాణించడానికి మక్కువ చూపిస్తారు. అన్న, అక్కని స్ఫూర్తిగా తీసుకునే వారిని అరుదుగా చూస్తుంటాం. అటువంటి వారు సినిమా పరిశ్రమలోనూ ఉన్నారు. అక్క నటనను చూసి తాము కూడా నటించాలని సినిమాల్లోకి ప్రవేశించిన వారున్నారు. అలా వెండితెరపై ఆకట్టుకున్న అక్కాచెల్లెళ్లపై ఫోకస్..

జ్యోతి లక్ష్మి – జయమాలిని తెలుగు, తమిళ చిత్రాల్లో ఐటెం సాంగ్ పేరు చెప్పగానే ముందు గుర్తుకు వచ్చే పేర్లు జ్యోతి లక్ష్మి – జయమాలిని. ఈ అక్కాచెల్లెళ్లు తమ అందం, నృత్యంతో అలరించారు.

జయసుధ – సుభాషిణి జయసుధ తన సహజమైన నటనతో సహజనటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే తన సోదరి సుభాషిణి ని కూడా నటిగా ప్రోత్సహించారు.

రాధా – అంబిక నటనతో పాటు అదిరే స్టెప్పులతో రాధా అదరగొట్టింది. అక్కని స్ఫూర్తిగా తీసుకొని అంబిక సినిమాల్లో అడుగుపెట్టి రాణించింది.

రాధిక – నిరోషా సినీ నేపథ్యం కలిగిన రాధిక తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఆమె చెల్లెలు నిరోషా కూడా మంచి నటిగా పేరు తెచ్చుకుంది.

నగ్మా, జ్యోతిక – రోషిని అందం, అభినయంతో నగ్మా మెప్పించింది. నగ్మా సపోర్ట్ తో చెల్లెళ్లు జ్యోతిక, రోషినిలు హీరోయిన్స్ గా అందరి హృదయాలను గెలుచుకున్నారు.

షామిలి – షాలిని షామిలి, షాలినిలు చిన్న వయసులోనే నటించి అవార్డులు అందుకున్నారు. ఆ తర్వాత హీరోయిన్స్ గాను విజయాలను అందుకున్నారు.

కాజల్ – నిషా అగర్వాల్ బాలీవుడ్ బ్యూటీ కాజల్ అగర్వాల్ తన నటనతో తెలుగు ఆడపడుచుగా పేరు తెచ్చుకుంది. అక్క బాటలోనే నిషా అగర్వాల్ నడిచింది. అయితే హిట్స్ రాకపోవడంతో అక్క కంటే ముందే పెళ్లి చేసుకొని సెటిల్ అయింది.

శృతి – అక్షర హాసన్కమలహాసన్, సారిక ల కుమార్తెలు శృతి హాసన్, అక్షర హాసన్. ఈ అక్క చెల్లెళ్లకి సినిమాలే లోకమయింది. శృతి హాసన్ హీరోయిన్ గా మూడు భాషల్లోనూ సినిమాలు చేసింది. అక్షర హాసన్ కూడా ధనుష్ సరసన నటించింది.

ఆర్తి – అతిధి అగర్వాల్ ఆర్తి – అతిధి అగర్వాల్ ఈ ఇద్దరు మెగా హీరోలతో సినిమాలు చేశారు. అక్క మెగాస్టార్ తో ఇంద్ర సినిమాలో నటించగా, చెల్లెలు అల్లు అర్జున్ తో గంగోత్రిలో ప్రేమలో పడింది. అతిధి అగర్వాల్ అవకాశాలు లేక పక్కకు తప్పుకోగా.. ఆర్తి అనారోగ్యంతో చనిపోయింది.

సంజన – నిక్కీ గల్రాని ప్రభాస్ పక్కన సంజన బుజ్జిగాడు సినిమాలో నటించింది. అలాగే కొన్ని సినిమాలు చేసి మంచి పేరు తెచ్చుకుంది. ఆమె చెల్లెలు నిక్కీ గల్రాని కూడా హీరోయిన్ గా ఎదిగింది.

కార్తీక అండ్ తులసి నటి రాధ కుమార్తెలు కార్తీక, తులసి. వీరిద్దరూ దక్షిణాది సినిమాల్లో సత్తా చాటుతున్నారు. కార్తీక జోష్ సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయం కాగా, తులసి “మణిరత్నం” కడలి చిత్రంతో అరంగ్రేటం చేసింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus