Sita Ramam: ‘సీతా రామం’ కి 3 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

దుల్కర్ సల్మాన్ ‘వైజయంతి మూవీస్’ ‘స్వప్న సినిమా’ బ్యానర్లో ‘మహానటి’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత చేసిన చిత్రం ‘సీతా రామం’. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో రష్మిక మందన అత్యంత కీలక పాత్ర పోషించింది. సీనియర్ హీరో సుమంత్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ పోషించడం జరిగింది. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం పెద్దగా అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 2022 ఆగస్టు 5న విడుదలైన ఈ సినిమా మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.

Sita Ramam Collections

దీంతో బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించింది. నేటితో ఈ సినిమా రిలీజ్ అయ్యి 3 ఏళ్ళు పూర్తి కావస్తోంది. ఈ సందర్భంగా ‘సీతా రామం’ క్లోజింగ్ కలెక్షన్స్ ను ఓ లుక్కేద్దాం రండి :

నైజాం 10.06 cr
సీడెడ్ 1.98 cr
ఉత్తరాంధ్ర 3.60 cr
ఈస్ట్ 2.03 cr
వెస్ట్ 1.30 cr
గుంటూరు 1.70 cr
కృష్ణా 1.80 cr
నెల్లూరు 0.92 cr
ఏపీ+తెలంగాణ 23.39 cr
తమిళ్ +  మలయాళం 11.2 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 4.3 cr
ఓవర్సీస్ 7.3 cr
వరల్డ్ టోటల్ 46.19 cr (షేర్)

 

‘సీతా రామం’ చిత్రం రూ.17 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం రూ.46.19 కోట్ల షేర్ ను రాబట్టి బయ్యర్లకు రూ.29.19 కోట్ల లాభాలు అందించింది. ఆలస్యంగా రిలీజ్ అయినప్పటికీ హిందీలో కూడా ఈ సినిమా మంచి వసూళ్లు సాధించింది. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో దర్శకుడు హను రాఘవపూడికి ఇప్పుడు ప్రభాస్ తో సినిమా చేసే అవకాశం లభించింది.

3 ఏళ్ళ ‘బింబిసార’.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus