Bigg Boss 7 Telugu: డాక్టర్ గా వచ్చి షాక్ ఇచ్చాడు..! సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రోమో..!

బిగ్ బాస్ టీమ్ ఈవారం హౌస్ లో ఫ్యామిలీ ఎపిసోడ్స్ ని ప్లాన్ చేసింది. అన్ని సీజన్స్ కంటే కూడా ముందే ఈవారం ఇలా ప్లాన్ చేశారు. గతవారమే వాళ్ల ఫ్యామిలీలకి కబురు పంపించారు. ఫస్ట్ శివాజీని మెడికల్ రూమ్ కి రమ్మని పిలిచి డాక్టర్ తో చెక్ చేయించారు. మీ చేయి రెండు మూడు రోజుల్లో సెట్ అయిపోతుందని డాక్టర్ చెప్తే, అవును అవ్వాలి ఎందుకంటే, నేను గేమ్ ఆడాలంటూ శివాజీ ఆవేశంతో చెప్పాడు.

ఒకే టేక్ రెస్ట్ అంటూ డాక్టర్ చెప్పాడు. తీరా శివాజీ వెళ్లిపోతుంటే, నాన్న అంటూ పిలిచాడు. దీంతో ఒక్కసారిగా షాక్ అయిన శివాజీ అరే, నువ్వా అంటూ హగ్ చేస్కుని తన కొడుకుని హౌస్ లోకి తీస్కుని వెళ్లాడు. అందరూ కూడా శివాజీ కొడుకుని చూసి ఎమోషనల్ అయ్యారు. ఇప్పుడు ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. గతంలో కౌషల్ – వాళ్ల పిల్లలు కన్ఫెషన్ రూమ్ లోనుంచీ మాట్లాడితే కౌషల్ వెళ్లి వాళ్లని హగ్ చేస్కున్న వీడియోని, దీనిని పోలుస్తున్నారు.

ఫ్యామిలీ ఎపిసోడ్స్ లో కౌషల్ అలాగే యాంకర్ రవి ప్రోమోలు ఎంత హైలెట్ అయ్యాయో, ఇప్పుడు శివాజీ కొడుకు ప్రోమో కూడా అంతే హైలెట్ అవుతోంది. ఇక హౌస్ లో శివాజీని ఎలాగైనా సరే నామినేషన్స్ లోకి లాగేయాలన్ని గౌతమ్ ప్లాన్ సక్సెస్ అయ్యింది. ఈవారం నామినేషన్స్ లో శివాజీ ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఈ ప్రోమో శివాజీ ఓటింగ్ ని మరింత పెంచే అవకాశం కూడా కనిపిస్తోంది.

ఇ ప్పటికే అన్ అఫీషియల్ పోలింగ్ సైట్స్ లో శివాజీ టాప్ లో దూసుకుపోతున్నాడు. ఇలాగే తను గేమ్ ఆడితే ఖచ్చితంగా టాప్ – 5 రేసుకి వెళ్తాడని, టైటిల్ కూడా కొట్టేస్తాడని బిగ్ బాస్ ఆడియన్స్ చెప్తున్నారు. మరోవైపు శివాజీ ఏ పాయింట్ లో దొరుకుతాడా ? ఏ టాస్క్ లో చిక్కుతాడా అని వేరే పార్టిసిపెంట్స్ వైయిట్ చేస్తున్నారు. ఇప్పటి వరకూ ఆడిన ఆటలో శివాజీ ఎక్కడా దొరకడం లేదు. ఒకవేళ ఏదైనా పాయింట్ దొరికినా దాన్ని వెంటనే మార్చేస్తున్నాడు.

ఇదే విషయం గతవారం గౌతమ్ నిరూపించాలని అనుకుని విఫలం అయ్యాడు. నాగార్జున ఫుల్ క్లాస్ పీకేసరికి కామ్ అయిపోయాడు. నామినేషన్స్ లో పాయింట్స్ చెప్పినా కూడా అది వాలిడ్ గా ప్రేక్షకులకి అనిపించలేదు. దీంతో శివాజీకి హ్యూజ్ గా ఓటింగ్ అనేది చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఫ్యామిలీ (Bigg Boss 7 Telugu) ఎపిసోడ్ సంబంధించిన ప్రోమో రావడం వల్ల కూడా శివాజీకి మంచి ప్లస్ అయ్యేలా కనిపిస్తోంది. అదీ మేటర్.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags