Sivaji: హీరో శివాజీ ఇంటికి వెళ్లిపోతున్నాడా ? అసలు ఏం జరగబోతోంది…!

బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్సీ టాస్క్ అనేది శివాజీకి ముప్పుగా మారింది. కన్ఫెషన్ రూమ్ లో శివాజీ బిగ్ బాస్ తో తన షోల్డర్ పైయిన్ గురించి, అలాగే తన మనసులో ఫీలింగ్స్ గురించి చెప్పుకుని మరీ బాధపడ్డాడు. బయట హౌస్ మేట్స్ ముందు ఏడవలేకపోతున్నానని అందుకే ఇక్కడ కన్నీళ్లు పెట్టుకుంటున్నా అంటూ బాధపడ్డాడు. ఇండైరెక్టర్ గా నన్ను ఆడలేకపోతున్నావంటే బాధగా ఉందని అన్నాడు. అంతేకాదు, ఒకవైపు తన షోల్డర్ బాగా నొప్పు పుడుతోందని, చేయి అంతా బాగా గుంజేస్తోందని చెప్పాడు. అసలు మేటర్ లోకి వెళితే.,

బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం కెప్టెన్సీ టాస్క్ నడుస్తోంది. ఇందులో భాగంగా గెలిచిన జిలేబీ పురం మెంబర్స్ అందరూ కూడా కెప్టెన్సీ కంటెండర్స్ అయ్యారు. వీళ్లలో నుంచీ కెప్టెన్ కి ఎవరు అనర్హులో ప్రకటించి తగిన కారణాలు చెప్పమని గులాబీ పురం మెంబర్స్ కి ఆర్డర్ వేశాడు బిగ్ బాస్. దీంతో ఒక్కొక్కరూ ఒక్కొక్కరిని కెప్టెన్సీ రేస్ నుంచీ తప్పించారు. స్మిమ్మింగ్ పూల్ లో ఫ్లోట్ ఆర్ సింక్ అనే టాస్క్ లో భాగంగా వారి ఫోటోని పూల్ లో ముంచి వారిని ఎలిమినేట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడే ఒక్కొక్కరూ వచ్చి ఒక్కొక్కరిని కెప్టెన్సీ రేస్ నుంచీ తప్పించారు. ముందు అమర్ శివాజీని రేస్ నుంచీ తప్పించాడు.

ఇద్దరి మద్యలో గట్టి మాటల యుద్ధం అయ్యింది. దీంతో హర్ట్ అయిన (Sivaji) శివాజీ నన్ను పంపించేయండి బిగ్ బాస్. వెంటనే డోర్స్ తీసేయండి అంటూ రెచ్చిపోయాడు. ఆ తర్వాత బిగ్ బాస్ శివాజీ బాధపడుతుంటే కన్ఫెషన్ రూమ్ కి పిలిచాడు. కన్ఫెషన్ రూమ్ లో శివాజీ బాగా బాధపడ్డాడు. తనని ఆడలేకపోతున్నావని ఎవరైనా అంటుంటే తీస్కోలేకపోతున్నానని, చేయి అంతా బాగా నొప్పి పుడుతోందని చెప్పాడు. ఇక హెల్త్ కారణంగా బిగ్ బాస్ శివాజీని ఇంటికి పంపించేయబోతున్నాడా అనే అనుమానాలు వస్తున్నాయి. అంతేకాదు, సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ న్యూస్ వైరల్ అయ్యింది

శివాజీ మరో వారం ఇలాగే షోల్డర్ పైయిన్ తో బాధపడుతుంటే., ఖచ్చితంగా బిగ్ బాస్ టీమ్ ఇంటికి పంపించే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఇప్పటికే శివాజీ ఒకసారి హౌస్ నుంచీ స్కానింగ్ కోసం బయటకి వెళ్లి వచ్చాడు. రికవరీ ఈ వారం అవుతాడనే అనుకున్నారు అందరూ. కానీ, శివాజీ ఇప్పుడు ఒక చేత్తో గేమ్ ఆడలేని పరిస్థితిలో ఉన్నాడు. అందుకే, కన్ఫెషన్ రూమ్ లోకి వచ్చి మరీ కన్నీళ్లు పెట్టుకున్నాడు. మరి ఈవారం శివాజీ బిగ్ బాస్ హౌస్ లో ఇలాగే కంటిన్యూ అయితే మాత్రం బిగ్ బాస్ మేనేజ్మెంట్ శివాజీని ఇంటికి పంపించేందుకు రెడీ అవుతుంది. దీనికి శివాజీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఎలా స్పందిస్తారు అనేది ఆసక్తికరం. అదీ మేటర్.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags