Bigg Boss 7 Telugu: అన్ అఫీషియల్ పోలింగ్ లో దూసుకుపోతున్న శివాజీ..! ఎలిమినేషన్ లో బిగ్ బాస్ ఇచ్చే ట్విస్ట్ ఇదేనా..!

బిగ్ బాస్ హౌస్ లో ఆరో వారం భారీగా మార్పులు రాబోతున్నాయి. వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్ లోకి ఆరుగురు వెళ్లబోతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. వీళ్లలో సీరియల్ బ్యాచ్ కూడా ఉన్నారు. అంతేకాదు, మోడల్ అశ్విని కూడా వెళ్లబోతోందనే టాక్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. దీంతో ఇప్పుడున్న హౌస్ మేట్స్ లో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది ఆసక్తికరంగా మారింది. సింగిల్ ఎలిమినేషన్ ఉంటుందా లేదా డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా అనేది చూడాలి. ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ చేస్తే మాత్రం ఖచ్చితంగా బిగ్ బాస్ ట్విస్ట్ ఇస్తాడు.

ఒక ఫేక్ ఎలిమినేషన్ అయితే చేస్తాడనే అనిపిస్తోంది. ఇక అన్ అఫీషియల్ ఓటింగ్ సైట్స్ లో చూస్తే ఈవారం శివాజీ టాప్ ఓటింగ్ తో చెలరేగిపోతున్నాడు. ఓటింగ్ లో తన ప్రభంజనాన్ని సృష్టిస్తున్నాడు శివాజీ. హౌస్ మేట్స్ అందరికీ కలిపి 50శాతం ఓటింగ్ జరిగితే శివాజీ ఒక్కడికే 50 శాతం ఓటింగ్ అనేది జరుగుతోంది. ప్రతి అన్ అఫీషియల్ పోలింగ్ సైట్స్ లో కూడా శివాజీనే టాప్ లో ఉన్నాడు ఓటింగ్ లో మొనగాడిలా దూసుకుపోతున్నాడు.

శివాజీకి 51 పర్సెంట్ ఓటింగ్ జరిగితే, సెకండ్ ప్లేస్ లో యావర్ కి 14 శాతం, థర్డ్ ప్లేస్ లో అమర్ కి 11 శాతం ఓటింగ్ అనేది జరుగుతోంది. ఇక మిగతా వాళ్లందరూ కూడా డేంజర్ జోన్ లోనే ఉన్నారు. ప్రియాంక, శుభశ్రీ, టేస్టీ తేజ, గౌతమ్ వీళ్లందరూ కూడా డేంజర్ లో ఉన్నారు. వీళ్లలో ఎవరైనా సరే ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. అయితే, బిగ్ బాస్ వీకండ్ భారీ ప్లాన్ వేశాడు. బిగ్ బాస్ హౌస్ లోకి కొత్తగా ఏడుగురు లేదా ఆరుగురు కంటెస్టెంట్స్ ని ఒకేసారి వైల్డ్ కార్డ్ ద్వారా పంపించబోతున్నాడు.

వీళ్లలో కూడా కన్ఫార్మ్ హౌస్ మేట్స్ ఎవరూ లేరని చెప్తూ వారికి పవర్ అస్త్రా సంపాదించుకోవాలని రూల్ పెట్టబోతున్నాడట. అంతేకాదు, ఫస్ట్ వీక్ వీళ్లకి నామినేషన్స్ కూడా ఉండవని చెప్తున్నారు. ఇక ఓటింగ్ లో లీస్ట్ లో ఉన్నవారిని కూడా వీళ్లతో జతకట్టమని చెప్తాడని హౌస్ మేట్స్ ఓటింగ్ ద్వారానే ఇది జరగబోతోందని ఇదే బిగ్ బాస్ ఇవ్వబోతున్న ట్విస్ట్ అని చెప్తున్నారు. కానీ, ప్రస్తుతం హౌస్ లో కెప్టెన్సీ టాస్క్ నడుస్తోంది. ఇందులో గౌతమ్ ఇంకా టేస్టీ తేజ నామినేషన్స్ లో ఉన్నారు.

వీళ్లలో ఒకరు కెప్టెన్ అయితే ఈవారం (Bigg Boss 7 Telugu) సేఫ్ అవుతారు. అప్పుడు అమ్మాయిల్లో ప్రియాంక, ఇంకా శుభశ్రీ ఇద్దరూ కూడా డేంజర్ జోన్ లోకి వస్తారు. ఒకవేళ కెప్టెన్సీ గౌతమ్ కి రాకపోతే ఖచ్చితంగా శుభశ్రీని సేవ్ చేయలేడు. వచ్చినా కూడా బిగ్ బాస్ ఏం కండీషన్స్ పెడతాడో ఎవ్వరికీ తెలీదు. అదే జరిగితే టేస్టీ తేజ లేదా గౌతమ్ ఇద్దరిలో ఒకరు సేఫ్ అయితే ఇంకొకరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. అలాగే డేంజర్ జోన్ లో శుభశ్రీ ఇంకా ప్రియాంకలు కూడా ఉంటారు. మరి వీళ్లలో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది ఆసక్తికరంగా మారింది.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus