Bigg Boss 7 Telugu: శివాజీ మాస్టర్ బ్రైయిన్..! యావర్ కి క్లాస్..! భోలే వెళ్లిపోయాక ఏం జరిగిందంటే.?

బిగ్ బాస్ ఈ సీజన్ లో దీపావళి ఎపిసోడ్ ధూమ్ ధామ్ గా జరిగింది. సెలబ్రిటీ గెస్ట్ లు, హౌస్ మేట్స్ కుటుంబసభ్యులు స్టేజ్ పైకి వచ్చి సందడి చేశారు. అంతేకాదు, సినిమా గేమ్స్ ఆడిస్తూ నాగార్జున హోస్టింగ్ ఇరగదీశాడు. చివర్లో భోలే – యావర్ ఇద్దరినీ నామినేషన్స్ లో పెట్టాడు బిగ్ బాస్. యావర్ ఈవారం సెల్ఫ్ నామినేషన్స్ వల్ల చివరి వరకూ బిగ్ బాస్ టీమ్ ఉంచింది. అలాగే, భోలే ని ఎలిమినేట్ చేశారు. ఇక బోలే వెళ్లిపోతుంటే అశ్విని – యావర్ – శివాజీ – ప్రశాంత్ వీళ్లంతా కూడా బాధపడ్డారు. భోలే ఎలిమినేషన్ తర్వాత శివాజీ యావర్ తో డిస్కషన్ పెట్టాడు.

యావర్ తో శివాజీ మాట్లాడుతూ నీ ఆట నువ్వు ఆడు. మార్చుకోవాల్సి అవసరం లేరు. టాప్ 5 అనేది ఎవరి కుటుంబ సభ్యులు వాళ్లు పెట్టేది. అలాగే బయట ఉండాలని రూల్ లేదు అంటూ చెప్పాడు. అంతేకాదు, దానిని పీకైనా సరే ఆట మారుస్తా అంటూ చెప్పాడు. ఇక్కడ రతిక గురించి మాట్లాడాడు శివాజీ. కానీ, రతిక శివాజీ చెప్పినట్లుగా వింటుందా లేదా అనేది చూడాలి. రతిక రీ ఎంట్రీ నుంచీ యావర్ గేమ్ పాడైపోయిందన్న విషయం అందరికీ అర్దమైంది. అదే యావర్ కి కూడా తెలిసేలా స్టేజ్ పైకి వచ్చిన కుటుంబసభ్యులు చెప్పారు. అలాగే, హైపర్ ఆది కూడా తన పంచ్ డైలాగ్స్ తో చెప్పేశాడు.

దీంతో యావర్ సెల్ఫ్ నామినేట్ (Bigg Boss 7 Telugu) అయినందుకు రియలైజ్ అయ్యాడు. ఇక్కడే శివాజీ తన మాస్టర్ బ్రైయిన్ ని చూపించాడు. రతకి వల్ల యావర్ కి ఇబ్బంది రాకుండా చూస్కునే బాధ్యతని తీస్కున్నాడు. ఎలాగైనా సరే దానిని పీకైనా సరే చెప్తానంటూ మాటలు జారాడు ఆ తర్వాత శివాజీ ఈవారం ఎవరిని నామినేట్ చేస్తాడు అనే డిస్కషన్ కూడా నడిచాయి. అర్జున్ ఇంకా అశ్విని కూడా నామినేషన్స్ గురించి మాట్లాడుకున్నారు. శివాజీ కెప్టెన్ గా తన డిప్యూటీస్ ని నియమించాడు. పల్లవి ప్రశాంత్ ఇంకా యావర్ లని తీస్కున్నాడు. విఐపి రూమ్ కి వాళ్లు షిఫ్ట్ అయిపోయారు. మిగతా వాళ్లు డీలక్స్ రూమ్ లోకి వెళ్లడానికి కొంచెం బయపడ్డారు.

ఎందుకంటే, డీలక్స్ రూమ్ లో పడుకున్నవాళ్లు ఎలిమినేట్ అవుతున్నారు అనే సెంటిమెంట్ ఎక్కువైంది. రతిక, అమర్ వెళ్లడానికి నిరాకరించారు. దీంతో ఈ బాధ్యతని గౌతమ్ నెత్తిమీద వేసుకున్నాడు. ముగ్గురు మాత్రమే అంటే అంతకంటే తక్కువ మంది ఉన్నా పర్లేదు కదా అనే లాజిక్ ని గౌతమ్ వర్కౌట్ చేశాడు. ఆ తర్వాత అశ్విని భోలే వెళ్లిపోయినందుకు బాధపడుతుంటే అర్జున్ వచ్చి ఓదార్చాడు. ఈవారం నుంచీ గేమ్ గట్టిగా ఆడాలని చెప్పాడు. అశ్విని హౌస్ లో నుంచీ వెళ్లిపోతానని అంటుంటే, బయట దీనికోసం చాలామంది వైయిట్ చేస్తున్నారని అన్నాడు. కాబట్టి గట్టిగా గేమ్ ఆడమని చెప్పాడు. అదీ మేటర్.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus