Bigg Boss 7 Telugu: బయట జనాల పల్స్ పట్టుకుంటున్న శివాజీ..! అన్ సీన్ లో ఏం జరిగిందంటే.?

బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం శోభాశెట్టి కెప్టెన్ అయ్యింది. అమర్ విధ్వంసకరమైన ఆటతో శోభాశెట్టిని గెలిపించాడు. ఈవారం అమర్ రెండు టాస్క్ లలో విజయం సాధించాడు. అయితే, ఈ టాస్క్ కంటే ముందు శివాజీ యావర్ కి శివోపదేశం చేస్తూ బుద్ధులు చెప్పాడు. బయట పబ్లిక్ ఏం అనుకుంటున్నారో నీకు తెలీదని, రతికతో జాగ్రత్తగా ఉండమని చెప్పాడు. ఎందుకంటే, ఆమెతో తిరిగితే నీ గేమ్ లో ఫోకస్ తగ్గిపోతుందని, ఆట స్పాయిల్ అవుతుందని ఆడియన్స్ ఫీల్ అయ్యే ఛాన్స్ ఉందని అన్నాడు.

అంతేకాదు, రతిక ఎలిమినేట్ అయ్యింది కూడా ఇదే విషయంలో అని అన్నాడు శివాజీ. బహుశా పల్లవి ప్రశాంత్ తో చేసింది ప్రజలకి నచ్చలేదు. అందుకే, ఇప్పుడు తనతో ఉండటం లేదు. ఇప్పుడు నీతో కూడా అదే సీన్ రిపీట్ అవుతుందేమో చాలా జాగ్రత్తగా ఉండమని సలహా ఇచ్చాడు. ఇక్కడే అమర్ తనకి అర్ధమైంది అంటూ తలూపుతూనే గౌతమ్ బెడ్స్ విషయంలో కూడా సరిగ్గా రూల్స్ పాటించడం లేదని తన కెప్టెన్సీ గురించి చెప్పాడు.

టాపిక్ డైవర్ట్ అవుతున్నా కూడా శివాజీ రతిక విషయంలో చాలా జాగ్రత్త అంటూ హెచ్చరించాడు. అన్ సీన్ లో ఏంజరిగిందంటే., యావర్ గేమ్ లో నుంచీ తప్పుకున్నాడు. కెప్టెన్సీ టాస్క్ లో ఫస్ట్ త్యాగం చేసింది యావర్. ఎందుకంటే, పల్లవి ప్రశాంత్ డెడ్ అయ్యాడు కాబట్టి తన తరపున ఆడేందుకు ఎవరూ లేరు. ఇక్కడ యావర్ ఆర్గ్యూమెంట్స్ పెట్టుకోవాల్సింది. గౌతమ్ గురించి మాట్లాడకుండా తన కెప్టెన్సీ గురించి కాకుండా అక్కడ అడిగి ఉంటే బాగుండేది.

కానీ అడగలేదు. తర్వాత శివాజీ దగ్గరకి వచ్చి కూర్చుని మంతనాలు జరిపాడు. అప్పుడు మెల్లగా శివాజీ రతిక టాపిక్ ని తీస్కుని వచ్చాడు. రతిక రీ ఎంట్రీ ఇచ్చి హౌస్ లోకి వచ్చింది. దీన్ని బట్టీ చూస్తే ఏది తనకి బ్యాడ్ అవుతుంది. ఏది గుడ్ అవుతుందనేది చెప్పలేం అని, ప్రెండ్షిప్ చేయ్, కానీ లిటిల్ డిస్టాన్స్ మైయిన్ టైన్ చేయమని సలహాలు ఇచ్చాడు. బయట ప్రేక్షకులు బహుశా మీ ఇద్దరిదీ రిసీవ్ చేస్కోలేదు అనుకో నీకే డేంజర్ అవుతుంది.

నీ గ్రాఫ్ పడిపోతుందంటూ హితబోధ చేశాడు. అందరూ బెడ్ రూమ్ లో పడుకున్న తర్వాత యావర్ కి – శివాజీకి ఈ డిస్కషన్ అనేది నడించింది. ఇక్కడే తేజ విఐపి రూమ్ లోకి వస్తాను పడుకుంటానని అన్నాడు. శివాజీ ఆ బెడ్ కి ఉన్న సెంటిమెంట్ చెప్పాడు. ఇక్కడ నిద్రపోతే సేఫ్ అవుతావని అన్నాడు. కాసేపు అందరూ ఆ బెడ్ గురించే మాట్లాడుకున్నారు. మొత్తానికి (Bigg Boss 7 Telugu) అదీ మేటర్.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus