Sivaji: హీరోయిన్స్ డ్రెస్సింగ్ పై కామెంట్స్… అనసూయగారు ఎందుకొచ్చారు ఇందులోకి: శివాజీ

‘దండోరా’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో భాగంగా సీనియర్ నటుడు శివాజీ(Sivaji) హీరోయిన్ల డ్రెస్సింగ్ గురించి చేసిన కామెంట్స్ పెను తుఫాను సృష్టించాయి అనే చెప్పాలి. ‘హీరోయిన్లుగా నిండుగా చీర కట్టుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదని.. లేదు అని సామాన్లు కనబడేలా డ్రెస్సులు వేసుకుంటే ప్రమాదాలు ఎదురవుతాయని’ అతను పలకడంపై గాయని చిన్మయి, అలాగే నటి అనసూయ మండిపడ్డారు.

Sivaji

వాళ్ళు మాత్రమే కాదు ఇండస్ట్రీకి చెందిన చాలా మంది నటీమణులు మహిళా సంఘాల వారిని ఆశ్రయించడం హాట్ టాపిక్ అయ్యింది. దీంతో శివాజీ క్షమాపణలు చెబుతూ వీడియో రిలీజ్ చేసినా అతనిపై విమర్శలు ఆగలేదు. దీంతో ‘దండోరా’ టీం ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి.. ఈ ఇష్యూని సాల్వ్ చేసే ప్రయత్నం చేసింది. ఇటీవల లులు మాల్లో నిధి అగర్వాల్, తర్వాత సమంత వంటి హీరోయిన్లకు ఎదురైనా చేదు అనుభవాలను దృష్టిలో పెట్టుకునే హీరోయిన్ల డ్రెస్సింగ్ గురించి అలా మాట్లాడాను అని శివాజీ చెప్పారు.

అలాగే సాయి పల్లవి, సౌందర్య వంటి వాళ్లకి ఇలాంటి అనుభవాలు ఎదురవ్వలేదు అంటే వాళ్ళ డ్రెస్సింగ్ కారణమని గుర్తుచేశాడు.ఇక అనసూయ వ్యాఖ్యల పై మాట్లాడుతూ.. “అనసూయ గారు నా ఇన్ సెక్యూరిటీ గురించి మాట్లాడారు. అవునమ్మా.. ‘మా హీరోయిన్లని ఈవెంట్లకి వెళ్ళినప్పుడు.. దాడులు చేసినప్పుడు.. భయముంటుంది, బాధ ఉంటుంది కాబట్టి ఒకవేళ జరగరానిది ఏమైనా జరిగితే వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటారని నాకు ఇన్ సెక్యూరిటీ ఉందమ్మా..!

ఇంకోటి నామీద మీరు జాలి చూపించారు. చాలా థాంక్స్ అమ్మా మీకు. మీ విశాల హృదయానికి ఆ భగవంతుడికి థాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే అదే భగవంతుడిని కోరుకుంటున్నాను.. మీ రుణం తొందరగా తీర్చుకునే అవకాశం నాకు ఇవ్వాలని’ శివాజీ కామెంట్స్ చేశారు. అది ఏ రకంగా అని మీడియా ప్రశ్నించగా.. అందుకు శివాజీ ‘ఆమె ఎక్కడైనా ఈవెంట్లకు వెళ్ళినప్పుడు ఆమెకు ఏమైనా ఇబ్బంది కలిగితే సమర్ధించేందుకు’ ” అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరాడు. శివాజీ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి

రెగ్యులర్ హర్రర్ సినిమా కాదు.. చివరి 20 నిమిషాలూ…!?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus