Sivaji: హీరోయిన్ల డ్రెస్‌లపై శివాజీ కామెంట్స్‌.. నోరు జారాడు.. ఏమీ అనుకోవద్దన్నాడు..!

టాలీవుడ్‌ నటుల్లో రాజకీయాలతో టచ్‌ ఉండి, సామాజిక అంశాల మీద తరచుగా మాట్లాడేవాళ్లు చాలా తక్కువగా ఉన్నారు. ఆ తక్కువ మందిలో శివాజీ ఒకరు. విలక్షణ నటుడిగా ఉంటూనే ఆ మధ్యలో రాజకీయాలతో, అమరావతి ప్రాంత రైతులతో టచ్‌లోకి వెళ్లి.. ఇప్పుడు తిరిగి సినిమాల్లోకి వచ్చి బిజీ అవుతున్నారు. అయితే మధ్యలో బిగ్‌బాస్‌లోకి కూడా వెళ్లి వచ్చారు. ఇలా చుట్టూ తిరిగిన ఆయనపై ప్రతి చోటా ఓ మచ్చ ఉంది. అదే నోరు జారుడు. ఏదైనా విషయం గురించి మాట్లాడేటప్పుడు టంగ్‌ స్లిప్‌ అయి ఏదేదో మాట్లాడేస్తుంటారు. ఆ తర్వాత కవర్‌ చేసుకుంటూ ఉంటారు.

Sivaji

రాజకీయాల నుండి బిగ్‌బాస్‌ వరకు ఇదే జరగ్గా.. ఇప్పుడు సినిమా పరిశ్రమలో కూడా అదే జరిగింది. మోస్ట్‌ కాంట్రవర్శీ టాపిక్‌ హీరోయిన్ల డ్రెస్‌లు అనే అంశం గురించి కొన్ని విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారు. వ్యాఖ్యలు అనే కంటే కాస్త నోరు జారారు అనే పదమే వాడాలి. ఇప్పటికే హెర్‌ చాయిస్‌ అంటూ డ్రెస్సింగ్‌ విషయంలో ఓ చర్చ నడుస్తున్న సమయంలో హీరోయిన్‌ల అందం వాళ్లు వేసుకునే డ్రెస్‌లలో ఉంటుందని కామెంట్‌ చేశాడు. నిండుగా దుస్తులు వేసుకుంటేనే గౌరవం ఉంటుంది అని ఆ టాపిక్‌ మరింత పెంచాడు.

ఆయన ప్రధాన పాత్రలో నటించిన ‘దండోరా’ సినిమా ప్రెస్‌ మీట్‌లో యాంకర్‌ డ్రెస్‌ సెన్స్‌ బాగుందని చెప్పిన శివాజీ.. హీరోయిన్‌ల దుస్తుల గురించి మాట్లాడారు. హీరోయిన్లు కొంచెం డ్రెస్‌ సెన్స్ పాటించాలి. ఇలా చెబుతున్నందుకు ఏమనుకోవద్దు. మీ అందం మొత్తం నిండుగా వేసుకొనే దుస్తుల్లోనే ఉంటుంది. ఫ్యాషన్‌ దుస్తులు వేసుకున్నప్పుడు అందరూ బాగున్నావనే అంటారు. కానీ, లోలోపల తిట్టుకుంటారు. స్త్రీ అంటే ప్రకృతి. ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరుగుతుంది అని అన్నారు.

గ్లామర్‌ ఉండాలి.. కానీ దానికి ఒక హద్దు ఉండాలి. స్వేచ్ఛ అనేది నా దృష్టిలో అదృష్టం. దాన్ని కోల్పోవద్దు. ప్రపంచ వేదికలపై చీర కట్టులో వచ్చిన వారికే విశ్వసుందరి కిరీటాలు వచ్చాయి అని శివాజీ చెప్పుకొచ్చారు. ఇందులో అభ్యంతరకర పదాలు ఏమున్నాయి అనుకోవద్దు. ఆయన చెప్పిన కొన్ని మాటలు మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయి. అందుకే వాటిని రాయలేదు. ఆ మాటలే ఇప్పుడు శివాజీని ఇరుకన పెట్టేశాయి.

 

రెండో వీకెండ్ ఓకే అనిపించిన ‘అఖండ 2’.. కానీ

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus