Bigg Boss 7 Telugu: తప్పుడు నా బిడ్డ అయితే తీసేయండి..! లైవ్ లో ఏం జరిగిందంటే.?

బిగ్ బాస్ హౌస్ లో 10వ వారం నామినేషన్స్ వాడి – వేడిగా జరుగుతున్నాయ్. ముఖ్యంగా శివాజీని భోలేని టార్గెట్ చేస్తూ నామినేట్ చేసారు గౌతమ్ ఇంకా అమర్. రాజమాతలుగా ఉన్న అశ్విని ఇంకా ప్రియాంక ఇద్దరూ కూడా మాటకి మాట అనుకుని ఆర్గ్యూమెంట్స్ పెట్టుకున్నారు. అమర్ భోలేని నామినేట్ చేస్తున్నప్పుడు వీక్ కంటెస్టెంట్ గా తీసేసావ్ అని అంటుంటే, మద్యలో రాజమాత అయిన ప్రియాంక దూరి వీక్ కంటెస్టెంట్ అని అమర్ అనలేదని వకాల్తా పుచ్చుకుంది.

దీంతో పక్కనే ఉన్న అశ్విని వదిలేశేయ్ ప్రియాంక అంటూ మాట్లాడింది. అయినా సరే ప్రియాంక రెచ్చిపోయింది. బేలో రాజమాత అని కూడా చూడకుండా రెచ్చిపోయి మరి అరిచాడు. ఎందుకు అమర్ తరపున మాట్లాడుతున్నావ్ .. బడ్డీస్ అనా అనేసరికి ప్రియాంక ఇంకా రెచ్చిపోయింది. విషయాన్ని కప్పిపుచ్చుతున్నారని భోలే రాజమాతపై నిందవేశాడు. ఇక్కడ ఎవరూ కప్పి పుచ్చడం లేదని చెప్పాడు.
అలాగే మీరు మద్యలోకి ఎందుకు వస్తున్నారని నిలదీస్తే, మీతో మాట్లాడుతుంటే అశ్విని వచ్చిందిగా అలాగే వచ్చానని చెప్పింది ప్రియాంక.

ఇక్కడే అశ్వినికి కోపం వచ్చింది. దీంతో ప్రియాంకతో ఆర్గ్యూమెంట్ పెట్టుకుంది. ప్రతిసారి నేను నొరు ఎత్తితే చాలు ప్రాబ్లమ్ అవుతోందని ఆవేశపడింది. ఇప్పుడు ఏంటి నువ్వు చాలా గ్రేట్ మేము ఇక్కడ కూర్చున్న వాళ్లందరం వేస్ట్ అంతేగా ? అంటూ దెప్పిపొడిచింది. ఇక్కడే కెప్టెన్ శోభా ఇన్వాల్ అయి ఎవరు మాట్లాడద్దని అన్నారు. కెమెరా ముందుకు వెళ్లి చెప్పు పో, అంటూ మాట్లాడింది. దీంతో అశ్విని బాధపడుతూ , కళ్లనీళ్లు పెట్టుకుంటూ శోభా- ప్రియాంక ఇద్దరి కాళ్లు పట్టుకుంది.

దీంతో ఇద్దరూ ఇంకా రెచ్చిపోయారు. ఇదేంటని ప్రశ్నించారు. బ్యాడ్ గా పోట్రే చేయాలని చూడద్దని వార్నింగ్ ఇచ్చారు. అశ్విని ఇంకా ఫ్రస్టేట్ అయిపోయింది. ఇదే ఊపులో రాజమాతలు వెళ్లి శివాజీని నామినేట్ చేస్తున్నామని ప్రకటించి కత్తితో శివాజీ ఫోటోని బ్రేక్ చేశారు. ఇక్కడే శివాజీ ఫైర్ అయ్యాడు. నేను తప్పుడు నా బిడ్డని అయితే నన్ను పీకిపారేయండి అంటూ ఆడియన్స్ ని రిక్వస్ట్ చేస్తున్నానని చెప్పాడు.

అంతేకాదు, తప్పుడు వాడు ఎవడైనా సరే అస్సలు క్షమించద్దు, అది శివాజీ అయినా సరే పీకేయండి అంటూ ఆడియన్స్ ని అడ్రస్ చేస్తూ చెప్పాడు శివాజీ. ఇక్కడ రాజమాతలు చెప్తున్నా కూడా., యాక్సెప్టెడ్ అంటూ వారిని చెప్పనివ్వకుండా అక్కడ్నుంచీ వాకౌట్ చేశాడు. మొత్తానికి 10వ వారం నామినేషన్స్ హీటెక్కాయనే చెప్పాలి. అలాగే బిగ్ బాస్ (Bigg Boss 7 Telugu) ఇచ్చిన ట్విస్ట్ కూడా అదిరిపోయిందనేది టాక్. మొత్తానికి అదీ మేటర్.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus