Bigg Boss 7 Telugu: : బిగ్ బాస్ గేమ్ ని రఫ్పాడించిన శివాజీ.! ఎక్కవ స్టార్స్ ఎలా వచ్చాయంటే.?

బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్సీ టాస్క్ లో శివాజీ – పల్లవి ప్రశాంత్ జంట రెచ్చిపోతోంది. ఇద్దరూ కూడా మంచి బడ్డీస్ గా గేమ్ ఆడుతున్నారు. స్మైల్ డిజైనింగ్ టాస్క్ లో అన్యాయం జరిగినా కూడా పట్టించుకోకుండా తర్వాత టాస్క్ ని బాగా ఆడారు ఇద్దరూ. అయితే, శివాజీ మాత్రం రూల్ బుక్ లో ప్రోపర్ గా స్మైల్ డిజైన్ ని పెట్టాలని లేదని ప్రిన్స్ కి ఎక్స్ ప్లయిన్ చేశాడు. అంతేకాదు, సంచాలక్ గా నువ్వు పార్షియాలిటీ చూపించావని నింద వేశాడు. పల్లవి ప్రశాంత్ అంటే నీకిష్టం లేదని ఎప్పుడైతే అన్నాడు ప్రిన్స్ చాలా బాధపడ్డాడు.

ఆ తర్వాత శివాజీ వెళ్లి ఓదార్చాడు. చాలాసేపు ఇద్దరి మద్యలో మాటలు కలిశాయి. తెల్లారిన తర్వాత కూడా ప్రిన్స్ తో ప్రేమగా మాట్లాడుతూ జరిగిన టాస్క్ ఎలాంటిదో చెప్పాడు. దీంతో మిగతా హౌస్ మేట్స్ కూడా శివాజీ మాటలకి ప్రభావితం అయ్యారు. ఆ తర్వాత బిగ్ బాస్ ఇంట్లో దొంగతనం టాస్క్ ఇచ్చాడు. బిగ్ బాస్ మిత్రుడు తన వస్తువులు పట్టుకుని యాక్టివిటీ ఏరియాలో నిద్రపోతున్నాడని వాటిని మీరు తెలివిగా తీసుకుని రావాలని చెప్పాడు. దీంతో అక్కడ గేమ్ మొదలైంది. అయితే, పార్టిసిపెంట్స్ ఫస్ట్ వెళ్లిన వాళ్లు కొన్ని వస్తువులని తీసుకున్నారు.

ఇక్కడే హౌస్ మేట్ ఒకరి వస్తువులు ఒకరు గుంజుకునే ప్రయత్నం చేశారు. దీనికి శివాజీ అడ్డుపడ్డాడు. గేమ్ అలా ఆడద్దని అది ఫైయిర్ గేమ్ కాదని చెప్పాడు. అయినా కూాడ వాళ్లు వినే స్టేజ్ లో లేరు. ఆ తర్వాత శివాజీ మిగతా వాళ్లు కూడా దొంగతనానికి వెళ్లారు. అయితే, సందీప్ – శోభా , శుభశ్రీ వీళ్లందరూ కూడా వస్తువులని ముందుగానే సంచీలో వేసేసుకున్నారు. దీంతో బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చాడు. ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టేయమని చెప్పాడు. అయినా కూడా సందీప్ – శోబా ఇద్దరూ కూడా కొన్ని వస్తువులు పెట్టారు కొన్ని పెట్టలేదు.

బిగ్ బాస్ ఇచ్చిన హింట్స్ ఆధారంగా వస్తువలని తీస్కుని బయటకి వచ్చారు. అయితే, బిగ్ బాస్ కి హౌస్ మేట్స్ ఆడిన పద్దతి నచ్చలేదు. అంతేకాదు, జంటలుగా నుంచోమని బిగ్ బాస్ అడిగినపుడు శోబా తేజ దగ్గర వస్తువు కొట్టేసింది. దీంతో ప్రిన్స్ లాక్కోవడానికి ప్రయత్నించాడు. కానీ, శోభా ఓవర్ గా రియాక్ట్ అయ్యింది. ముందు ఇచ్చేస్తానని చెప్పింది. ఆ తర్వాత ఇవ్వనని చెప్పింది. ఫైనల్ గా ప్రిన్స్ గుంజుకోవాల్సి వచ్చింది. ఇదంతా చూస్తున్న మిగతా హౌస్ మేట్స్ ఎవ్వరూ మాట్లాడలేదు. కానీ శివాజీ వదిలేయమని ఇది కరెక్ట్ గేమ్ కాదని మాట్లాడాడు. దీనివల్ల శివాజీ ఆడియన్స్ కి బాగా నచ్చుతున్నాడు.

ఇక బిగ్ బాస్ (Bigg Boss 7 Telugu) ఉల్టా పుల్టా అంటూ బిగ్ బాస్ చెప్పిన వస్తువులు కాకుండా ఎక్స్ ట్రా వస్తువులు ఎవరెవరు ఎన్ని తెచ్చారో దాన్ని బట్టీ విజేతలని ప్రకటించారు. ఈ టాస్క్ లో శివాజీ – పల్లవి ప్రశాంత్ జంట విజయం సాధించింది. దీంతో ఎక్కువ స్టార్స్ ని సంపాదించారు. గేమ్ ని బాగా అర్ధం చేస్కున్న శివాజీ టాస్క్ లో రఫ్ఫాడించాడు. మరోవైపు ఓటింగ్ లో కూడా శివాజీ దూసుకుపోతున్నాడు. సగానికి పైగా ఓట్లని తనే కైవసం చేసుకుంటున్నాడు. దీంతో శివాజీ తోపు – దమ్ముంటే ఆపు అంటున్నారు బిగ్ బాస్ లవర్స్. మొత్తానికి అదీ మేటర్.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus