బిగ్ బాస్ హౌస్ లో ఆదివారం ఎలిమినేషన్ అనేది చాలా ఉత్కంఠంగా ఉంటుంది. ఈసారి సీజన్ లో ఇప్పటివరకూ కూడా సోషల్ మీడియాలో అన్ అఫీషియల్ పోలింగ్ సైట్స్ లో బోటమ్ ఉన్నవారినే ఎలిమినేట్ చేస్తూ వచ్చారు. అయితే, ఈసారి షాకింగ్ ఎలిమినేషన్ ఉండబోతోందా.. టాప్ లో ఓటింగ్ లో మొనగాడిలా దూసుకుపోతున్న శివాజీని ఎలిమినేట్ చేయబోతున్నారా అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలు మేటర్లోకి వెళితే., శివాజీ ఈవారం ఓటింగ్ లో టాప్ లో ఉన్నాడు.
దాదాపుగా 45 శాతం ఓటింగ్ ని కైవసం చేసుకుని అందరికంటే కూడా టాప్ లో ఉన్నాడు. మరి అలాంటిది ఇప్పుడు ఎందుకు ఎలిమినేట్ చేస్తారు అనేది చాలామందికి వస్తున్న సందేహం. అయితే, శివాజీని ఎలిమినేట్ చేస్తే ఖచ్చితంగా సీక్రెట్ రూమ్ లో పెడతారు. అందుకే, బిగ్ బాస్ హౌస్ లో ఈవారం ఖచ్చితంగా షాకింగ్ ఎలిమినేషన్ ఉండబోతోందనే టాక్ వచ్చింది. నిజానికి లాస్ట్ టైమ్ శివాజీ నామినేషన్స్ లోకి వచ్చిపుడు కూడా ఇంతలా ఓటింగ్ అనేది జరగలేదు. పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ కూడా శివాజీకే ఓటింగ్ వేయడం వల్ల టాప్ పొజీషన్ లో ఉన్నాడు.
ఒకవేళ ఎలిమినేట్ చేస్తే ఫేక్ ఎలిమినేషన్ చేసి సీక్రెట్ రూమ్ లో పెట్టాలి. తర్వాత సెకండ్ ప్లేస్ లో ప్రిన్స్ యావార్ ఉన్నాడు. యావార్ కి కూడా 18 పర్సెంట్ వరకూ ఓటింగ్ అనేది జరిగింది. ఇక నెక్ట్స్ 15శాతం ఓటింగ్ తో అమర్ ఉన్నాడు. అమర్ కి కూడా బాగానే ఓటింగ్ అనేది జరిగింది. తర్వతా ప్లేస్ లో గౌతమ్ కి కూడా 12 శాతం వరకూ ఓటింగ్ అనేది జరిగింది. ఇక మిగిలిన 10 పర్సెంట్ ఓటింగ్ ని మాత్రం ముగ్గురు పంచుకోవాల్సి వచ్చింది.
ఈ ముగ్గురిలో ఎవరైనా సరే ఎలిమినేట్ అవ్వచ్చు. ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ ఉంటే మాత్రం బోటమ్ లో ఉన్న తేజ ఇంకా ప్రియాంకలు వెళ్లిపోవాల్సి వస్తుంది. అలా కాకుండా డబుల్ ఎలిమినేషన్ లో ఫేక్ అయితే మాత్రం శివాజీ ఇంకా తేజ ఇద్దరిని ఎలిమినేట్ చేసే ఛాన్స్ ఉంది. ప్రియాంక చాలా సైట్స్ లో బోటమ్ లో ఉంది. అలాగే శుభశ్రీ కూడా సేఫ్ అని చెప్పలేని పరిస్థితి. ఇద్దరి కంటే కూడా 1 పర్సెంట్ ఓటింగ్ మాత్రమే ఎక్కువ ఉంది. ఇక ఈవారం బిగ్ బాస్ (Bigg Boss 7 Telugu) దగ్గర నాలుగు ఆప్షన్స్ ఉన్నాయ్.. అవేంటంటే.,
1. ఫేక్ ఎలిమినేషన్ – శివాజీని చేసి సీక్రెట్ రూమ్ లో పెట్టచ్చు
2. షాకింగ్ ఎలిమినేషన్ – ప్రిన్స్ యావార్ ని ఎలిమినేట్ చేసే అవకాశం
3. డబుల్ ఎలిమినేషన్ – ఈసారి బోటమ్ లో ఉన్న ఇద్దరినీ ప్రియాంక ఇంకా టేస్టీ తేజని ఎలిమినేట్ చేయచ్చు
4. నో ఎలిమినేషన్ – వైల్డ్ కార్డ్ ద్వారా కొంతమంది కంటెస్టెంట్స్ వస్తున్నారు కాబట్టి ఈవారం ఎలిమినషన్ లేకుండా చేయచ్చు.
మరి ఈ 4 ఆప్షన్స్ లో దేనిని బిగ్ బాస్ టీమ్ ఉపయోగించుకుంటుందనేది చూడాలి.
మ్యాడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
ది గ్రేట్ ఇండియన్ సూసైడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
మామా మశ్చీంద్ర సినిమా రివ్యూ & రేటింగ్!