Bigg Boss 7 Telugu: ఉక్రోషంతో రగిలిపోయిన అమర్..! ఆడుకున్న శివాజీ..! టాస్క్ లో జరిగింది ఇదే..!

బిగ్ బాస్ హౌస్ లో గాల నైట్ పార్టీ అనేది హౌస్మేట్స్ మద్యలో చిచ్చు పెట్టింది. ఈవారం మొదటి నుంచీ కూడా ముగ్గురు మద్యలోనే డిస్కషన్స్ ఎక్కువగా నడిచాయి. నామినేషన్ ప్రక్రియ నుంచీ ఇప్పుడు పవర్ అస్త్రా కోసం పోటీ పడే కంటెండర్స్ వరకూ కూడా శివాజీ, సందీప్ ఇంకా శోభా ముగ్గురే నిర్ణయం తీస్కోవాల్సి వచ్చింది. దీంతో గాల నైట్ లో ఎవరి డ్రెస్ క్రియేటివ్ గా ఉంది, ఎవరు బాగా ఎంటర్ టైన్ చేశారు అనేది కూడా వాళ్లనే నిర్ణయించమని బిగ్ బాస్ చెప్పాడు.

దీంతో శివాజీ శుభశ్రీ డ్రెస్ బాగుందని చెప్పాడు. సందీప్ ఇంకా శోభా అమర్, శుభశ్రీ ఇద్దరి మద్యలో చాలాసేపు ఆలోచించారు. సందీప్ శివాజీతో అమర్ ది కూడా బాగుంది కదా అని అడిగాడు. దీనికి శివాజీ బాగుందనే చెప్పాడు. కానీ, అమర్ మాత్రం ఫైర్ అయ్యాడు. శుభశ్రీని ఎనౌన్స్ చేసిన తర్వాత తనది ఎందుకు నచ్చలేదో వివరణ ఇవ్వాలని గట్టిగా అడిగాడు. దీంతో శివాజీకి ఇంకా అమర్ కి మాటల యుద్ధం జరిగింది. అన్నీ జనాలు చూస్తున్నారు అని, నన్ను పంపించాలని చాలామంది చూస్తున్నారని అమర్ అన్నాడు.

దీనికి కౌంటర్ గా శివాజీ నిన్ను పంపిస్తే నాకేమస్తొది బాబాయ్.. మనం ఏమన్నా బద్ద శత్రువులమా అంటూ మాట్లాడాడు. నిజానికి శివాజీ ఫస్ట్ నుంచీ కూడా ఈ టాస్క్ పట్ల అంత ఆసక్తిని చూపించలేదు. తను డ్యాన్స్ లు చేస్తూ రెచ్చిపోతుంటే బిగ్ బాస్ వెళ్లి కూర్చోమని చెప్పాడు. అప్పట్నుంచీ శివాజీ టాస్క్ లో పెద్దగా పార్టిసిపేట్ చేయలేదు. శుభశ్రీ – పల్లవి ప్రశాంత్, ప్రిన్స్ ఇంకా శివాజీ వీళ్లు ఒక గ్రూప్ గా అయితే ఫామ్ అయ్యారు.

కానీ, శివాజీ మాత్రం నా దగ్గరకి వచ్చి ఎవరు మాట్లాడినా మాట్లాడతాను అన్నట్లుగానే ఉన్నారు. కానీ, అమర్ అండ్ ప్రియాంక బ్యాచ్ కి మాత్రం ఇది ఎక్కడం లేదు. కావాలనే శివాజీ వారిని టార్గెట్ చేస్తున్నాడని వాళ్లకి అర్ధమైంది. మరోసారి శివాజీ నోరు జారి నన్ను పంపిచేయ్ బిగ్ బాస్ ఇక్కడ ఉండలేను. నెక్ట్స్ వీక్ ఎలిమినేట్ చేసేయ్ అంటూ ఫ్రస్టేషన్ లో అదే మాట రిపీట్ చేశాడు. లాస్ట్ టైమ్ దీనిేకే ఒక బ్యాటరీ పాయింట్ కూడా శివాజీది పోయింది.

ఇక అమర్ విషయంంలో కూడా శివాజీ చేసింది అస్సలు తప్పే కాదు, శివాజీ డెసీషన్ శోభా అండ్ సందీప్ లకి వదిలేశాడు. వాళ్లిద్దరూ సుబ్బూ ఓకే అంటే ఎనౌన్స్ చేయి అని చెప్పాడు. అక్కడ క్లారిటీ లేనిది వాళ్లిద్దరికీ. వాళ్లు స్ట్రాంగ్ గా అమర్ అంటే శివాజీ కూడా ఓకే అనేవాడే. కానీ వాళ్లు అనలేదు. ఈ విషయం తర్వాత సందీప్ అమర్ తో డిస్కస్ కూడా చేశాడు. ఏది ఏమైనా హీటెడ్ ఆర్గ్యూమెంట్స్ తో శివాజీ తనలోని పవర్ ని చూపిస్తుంటే, అమర్ మాత్రం రెచ్చిపోతూ తనలోని ఫైర్ ని చూపిస్తున్నాడు. అదీ మేటర్.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus