బిగ్ బాస్ హౌస్ అంటేనే స్ట్రాటజీలతో గేమ్ ఆడటం. అందులోనూ ఒకరినొకరు ఫేవరెటిజం చూపించుకుంటూ కొన్ని బంధాలని నటిస్తూ , కొంత డ్రామా ప్లే చేస్తూ గేమ్ ఆడటం అనేది హౌస్ మేట్స్ కి కొట్టిన పిండి లాంటిది. ఇప్పుడు సీజన్ 7లో కూడా అదే జరుగుతోంది. వాజీ వర్సెస్ స్టార్ మా బ్యాచ్.. ఫస్ట్ వీక్ నుంచీ కూడా వీళ్లకి అస్సలు పడట్లేదు. ముఖ్యంగా ప్రియాంక ఇంకా అమర్ కలిసి ఆడటం అనేది శివాజీకి ఫస్ట్ నుంచీ నచ్చడం లేదు. 2వ వారమే ఈవిషయం నాగార్జున ముందు చెప్పాడు శివాజీ.
కొన్ని విషయాల్లో కన్సిడర్ చేసుకుంటూ వెళ్తున్నారని, ఫేవరెటిజం కనిపించిపోతోందని చెప్పాడు. ఇసుక టాస్క్ లో ఎప్పుడైతే సందీప్ ఇంకా ప్రియాంకలని మిగతా హౌస్ మేట్స్ ఎంచుకున్నారో అప్పట్నుంచీ కూడా శివాజీ వాళ్లపై కోల్డ్ వార్ డిక్లేర్ చేశాడు. ఫేవరెటిజం లేకుండా గేమ్ ఆడితే మంచి గేమ్ బయటకి వస్తదని నాగార్జునకే డైరెక్ట్ గా చెప్పాడు శివాజీ. ఆ తర్వాత కూడా శివాజీ అమర్ ఇంకా ప్రియాంక గేమ్ ని తప్పుబడ్డాడు. ఫస్ట్ వీక్ లో ప్రియాంకకి శివాజీకి అస్సలు పడలేదు. ఆ తర్వాత అమర్ కొద్దిగా శివాజీ పవర్ అస్త్ర ని కొట్టేసి గేమ్ ఆడాడు.
ఆ తర్వాత ఇచ్చేసినపుడు దగ్గరయ్యాడు. కానీ, మళ్లీ వీళ్లిద్దరి మద్యన దూరం పెరిగిపోయింది. సందీప్ అయితే అన్నా అన్నా అంటున్నాడే కానీ మనసులో మాత్రం గట్టిగా ఇచ్చేయాలని ఉంది. ఛాన్స్ కోసం చూస్తున్నాడు అంతే. అలాగే, ఏటిఎమ్ టాస్క్ లో శోభాశెట్టి కూడా ఛాన్స్ దొరికితే అమర్ అంటున్నారు అంటూ నిలదీసింది. ఆ తర్వాత సందీప్ తో కలిసి మనల్ని ఆయన బ్యాడ్ గా ఆడియన్స్ ముందు పోట్రే చేస్తున్నాడంటూ అభిప్రాయపడింది. అందు నాకు కాలుతోందని ఛాన్స్ దొరికితే ఇచ్చేస్తానని చెప్పింది. అన్నట్లుగానే కిచెన్ లో , డైనింగ్ టేబుల్ దగ్గర గొడవ పెట్టుకుంది.
ఈ నలుగురు ఎప్పట్నుంచో శివాజీకి యాంటీ అయ్యారు. అయితే, ఇప్పుడు ఇంకో ఇద్దరూ శివాజీ పైన చాలా గుర్రుగా ఉన్నారు. 4వ వారం నామినేషన్స్ లో గౌతమ్, ఎటిఎమ్ టాస్క్ శుభశ్రీ కూడా శివాజీకి యాంటీ అయ్యారు. ఫస్ట్ వీక్ లో కోల్డ్ వార్ నడిచినా సెకండ్ వీక్ నామినేషన్స్ లో రెచ్చిపోయారు. అమర్ ముఖ్యంగా ప్రసాంత్ ని వెనకేసుకుని రావద్దని క్లియర్ గా చెప్పాడు. ఇక మూడోవారం నామినేషన్స్ లో శివాజీ రాలేదు కాబట్టి వీరికి ఛాన్స్ లేకుండా పోయింది. నాలుగోవారం జ్యూరీలో కూడా చాలా సార్లు క్లాషెష్ వచ్చాయ్.
శివాజీ రతిక విషయంలో సైడ్ అయిపోవడం, అలాగే ప్రియాంక – అమర్ లది పెద్ద తప్పు అని చెప్పి నామినేట్ చేయమని అనడం, అలాగే, స్మైలీ ఫోటో టాస్క్ లో యారోగెంట్ గా మాట్లాడుతున్నావ్ అని సందీప్ కి క్లాస్ పీకడం, శోబాశెట్టిని కూడా లెక్కచేయకుండా మాట్లాడటం ఇవన్నీ శివాజీ గేమ్ ని దెబ్బకొట్టేస్తున్నాయి. ఇక గౌతమ్ కూడా శివాజీ డెసీషన్ నచ్చలేదు. ప్రిన్స్ యావార్ ని వెనకేసుకుని వచ్చి మాట్లాడాడని రెచ్చిపోయాడు.
ఇలా ప్రిన్స్, ప్రశాంత్ లని శివాజీ కాపాడుతూ వస్తున్నాడు. ఇక శివాజీకి ఇప్పుడు శుభశ్రీ కూడా ఎదురు తిరిగింది. తన దగ్గరగా వచ్చి కాపల కాశాడనని మరీ అంత ఓవర్ యాక్షన్ చేయక్కర్లేదని రెచ్చిపోియంది. ఫైనల్ గా శివాజీకి యాంటీగా మారుతున్నారు అందరూ. శివాజీ కూడా తన నోటిదూలని ఎప్పటికప్పుడు చూపిస్తునే ఉన్నాడు. దీనివల్ల తన (Bigg Boss 7 Telugu) గేమ్ లో ఎంత జెన్యూనిటీ ఉన్నా చిన్నమాటతో అది తుడిచి పెట్టుకు పోతోంది.
ఆ తర్వాత కవర్ కోటింగ్ ఎంత చేసినా, ఆయన ఉద్దేశ్యం అది కాదని చెప్పినా హౌస్ మేట్స్ వినిపించుకోవడం లేదు. ఇప్పుడు స్టార్ మా బ్యాచ్ అంటే సీరియల్ బ్యాచ్ వర్సెస్ శివాజీ గా బిగ్ బాస్ సీజన్ 7 మారుతోంది. మరి ఇది ఇలాగే ఉంటే వచ్చే వైల్డ్ కార్డ్ ఎంట్రీలు కూడా శివాజీని ఒక ఆట ఆడుకునేలాగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో నెక్ట్స్ శివాజీని ఎలా టార్గెట్ చేయబోతున్నారు అనేది ఆసక్తికరం. అదీ మేటర్.
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!