Bigg Boss 7 Telugu: నామినేషన్స్ లో రచ్చ రచ్చే..! బిగ్ బాస్ కావాలని పవర్ అస్త్రాలు ఎందుకు లాక్కున్నాడంటే.,

బిగ్ బాస్ హౌస్ లో 5వ వారం సూపర్ డూపర్ ట్విస్ట్ తో ఎపిసోడ్ ఎండ్ అయ్యింది. నిజానికి సండే ఎపిసోడ్ అయిన తర్వాత హౌస్ లో చాలా డిస్కషన్స్ అయ్యాయి. శోభా అయితే నాగార్జున గారి ముందు మాట్లాడలేకపోయానని చెప్పింది. అలాగే అమర్ , సందీప్ నాగార్జున మాటలకి బాగా హర్ట్ అయ్యారు. మిగతా హౌస్ మేట్స్ కూడా సైలెంట్ గా ఉండిపోయారు. తేజ అయితే డిషెష్ కడుగూతూ జైల్ కీ కోసం వైయిట్ చేశాడు. అయితే, కీ అప్పుడే పంపలేదు బిగ్ బాస్.

ఈలోగా శివాజీకి విఐపి రూమ్ నుంచీ వేరే బెడ్ కేటాయించమని చెప్పాడు బిగ్ బాస్. ఇక్కడే లొల్లి అయ్యింది. తేజ నేను జైల్ కి వెళ్లకుండా ఎందుకు నా బెడ్ ఇస్తారు. నేను ఒప్పుకోను అని గోల చేశాడు. కానీ, సందీప్ మాత్రం శివాజీకి బెడ్ కేటాయించాడు. ఇక తర్వాత రోజు మద్యాహ్నం నుంచీ నామినేషన్స్ మొదలయ్యాయి. ప్రతి హౌస్ మేట్ ఇద్దరిని నామినేట్ చేస్తూ కత్తిపోట్లు గూచ్చాల్సి ఉంటుంది. ఈ రకమైన నామినేషన్స్ చాలాసార్లు మనం చూసిందే. అలాగే, టాస్క్ లలో కూడా సపోర్ట్ చేయని వాళ్లని ఇలా పోటు పొడవమని బిగ్ బాస్ ఎప్పుడూ చెప్తునే ఉంటాడు.

ఇక శివాజీ, అమర్, ప్రియంక ఈ ముగ్గురికే ఎక్కువ ఓట్లు వచ్చాయి. స్టార్ మా బ్యాచ్ శివాజీ బ్యాచ్ కి, శివాజీ బ్యాక్ స్టార్ మా బ్యాచ్ కి పోట్లు పొడిచారు. ఇద్దరి మద్యలో మాటల యుద్ధమే జరిగింది. ముఖ్యంగా శివాజీ మీ దగ్గర రీజన్స్ లేకుండా చేయి ఎందుకు ఎత్తారంటూ అమర్ ని అలాగే ప్రియాంకని ప్రశ్నించాడు. వాళ్లు వివరణ ఇచ్చేందుకు ప్రయత్నంచారు. కానీ, శివాజీ ఎక్కడా వినిపించుకోలేదు. అన్నీ జనాలు చూస్తున్నారు అంటూ పదే పదే అదే మాట చెప్తూ నామినేట్ చేశాడు.

అలాగే, అమర్ ప్రియాంక ఇద్దరూ కూడా శివాజీ ఇంకా ప్రిన్స్ ని , శుభశ్రీని నామినేట్ చేశారు. ఇక్కడ చాలా పాయింట్స్ , లాజిక్స్ మాట్లాడారు. అయితే, ఎక్కడా కూడా గొడవలు అవ్వడం, పెద్దపెద్దగా అరుచుకోవడం లేకుండా సింపుల్ గా నామినేషన్స్ అయిపోయాయి. ఈ నామినేషన్స్ లో కంటెస్టెంట్ నుంచీ హౌస్ మేట్స్ గా మారాలంటే అందరూ నామినేట్ అవ్వాలంటూ బిగ్ బాస్ అందర్నీ నామినేట్ చేశాడు. పవర్ అస్త్రా దక్కించుకున్న శోభా, సందీప్ , ఇంకా ప్రశాంత్ ఈ ముగ్గురే నామినేషన్స్ నుంచీ సేఫ్ అయ్యారు. అయితే, ఈసారి బిగ్ బాస్ (Bigg Boss 7 Telugu) ఎవరికీ కూడా ప్రత్యేకమైన పవర్ ఇవ్వలేదు.

అలాగే, 5వ వారం వచ్చేసింది కాబట్టి, హౌస్ మేట్స్ నుంచీ పవర్ అస్త్రాలని లాగేసుకున్నాడు బిగ్ బాస్. అందరికీ ఇమ్యూనిటీ పూర్తి అయిపోయింది కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నాడు బిగ్ బాస్. ఇప్పటికే నలుగురు కంటెస్టెంట్స్ హౌస్ మేట్స్ గా మారి తిరిగి మళ్లీ కంటెస్టెంట్స్ గానే మిగిలారు. ఇక అందరు హౌస్ మేట్స్ ఈవారం మాములుగానే కంటెస్టెంట్స్ గానే పోరాడతారు. వచ్చేవారం వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉంటాయి కాబట్టి, ఎవరెవరు వస్తారు ? ఎవరెవరు వెళ్లిపోతారు అనేది ఆసక్తికరం. అదీ మేటర్.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus