తెలుగు, తమిళ భాషలో తెరకెక్కనున్న సినిమాలో ఆరుమంది హీరోయిన్స్!
- September 11, 2017 / 01:50 PM ISTByFilmy Focus
మలయాళ చిత్రాలు మంచి కథలతో తెరకెక్కి విజయం సాధిస్తుండటంతో.. వాటిపై తెలుగు, తమిళ చిత్ర ప్రముఖుల ఆసక్తి కనబరుస్తున్నారు. హిట్ అయిన కథలను రీమేక్ చేయడానికి ముందున్నారు. అలా మరో అద్భుతమైన మలయాళ కథ తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానుంది. మలయాళంలో ఘనవిజయం సాధించిన లేడీ ఓరియెంటెడ్ థ్రిల్లర్ ‘100 డిగ్రీస్ సెల్సియస్’ చిత్రాన్ని ఒకేసారి తెలుగు, తమిళంలో రీమేక్ చేస్తున్నట్టు నిర్మాత శోభారాణి తెలిపారు. ఎస్‌వీఆర్ మీడియా ప్రై. లిమిటెడ్ బ్యానర్ పై ఈ మూవీ నిర్మితం కానుంది.
‘యారిడి నీ మోహిని’, ‘ఉత్తిమ పుత్తిరన్’ చిత్రాల దర్శకుడు మిత్రన్ జవహర్ తమిళ రీమేక్‌కి దర్శకత్వం వహించనున్నారు. వచ్చే నెల సెట్స్ పైకి వెళ్లనున్న ఈ చిత్రంలో లీడ్ రోల్ రాయ్ లక్ష్మి పోషించనుంది. ఆమె ఒక్కరే కాకుండా మరో ఐదుమంది హీరోయిన్స్ నటించనున్నారు. హెబ్బాపటేల్, నందిత శ్వేత, రాగిణి ద్వివేది, నికిషా పటేల్ మిగతా పాత్రలకు ఎంపికయ్యారు. మరో హీరోయిన్ ఫైనల్ కావాల్సి ఉంది. ఈ మూవీ గురించి మరిన్ని వివరాలను త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.












