Sj Suriya: ఆ బాకీని ఎప్పటికైనా తీర్చుకుంటానన్న ఎస్.జే.సూర్య.. ఏమైందంటే?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన మహేష్ బాబు టాలెంట్ ఉన్న డైరెక్టర్లకు ఛాన్స్ ఇచ్చే విషయంలో ముందువరసలో ఉంటారు. మహేష్ బాబు ఎస్.జే.సూర్య కాంబినేషన్ లో నాని సినిమా తెరకెక్కగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. మహేష్ బాబు సినీ కెరీర్ లో భారీ స్థాయిలో నష్టాలను మిగిల్చిన సినిమాలలో ఈ సినిమా కూడా ఒకటి కావడం గమనార్హం. గతంలో ఈ సినిమా ఫలితం గురించి పలు సందర్భాల్లో స్పందించిన ఎస్.జే.సూర్య తాజాగా ఈ సినిమా గురించి మరోమారు కీలక వ్యాఖ్యలు చేశారు.

మార్క్ ఆంటోని సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా సూపర్ స్టార్ మహేష్ బాబుకు నేను బాకీ పడ్డానని సూర్య అన్నారు. అజిత్ కు వాలి పవన్, విజయ్ లకు వేర్వేరుగా ఖుషి సినిమాలతో సక్సెస్ ఇచ్చిన తాను మహేష్ కు మాత్రం రుణపడ్డానని ఆయన తెలిపారు. మహేష్ కు హిట్ ఇవ్వలేకపోయాననే బాధ ఇప్పటికీ నన్ను వెంటాడుతోందని సూర్య చెప్పుకొచ్చారు. మహేష్ తో మళ్లీ సినిమా తీసి రుణం తీర్చుకుంటానని ఆయన పేర్కొన్నారు.

రాబోయే రోజుల్లో మహేష్ ఎస్.జే.సూర్య (Sj Suriya) కాంబినేషన్ లో మరో సినిమా వస్తుందేమో చూడాలి. మహేష్ బాబు తర్వాత ప్రాజెక్ట్ లతో సైతం రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సినిమా సినిమాకు మహేష్ మార్కెట్ పెరుగుతుండగా ప్రస్తుత పరిస్థితుల్లో మహేష్ డేట్స్ దొరకడం ఎస్.జే.సూర్యకు సులువు అయితే కాదు. మహేష్ బాబు తర్వాత ప్రాజెక్ట్ లపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.

మహేష్ బాబు గుంటూరు కారం సినిమాను పూర్తి చేసి రాజమౌళి సినిమాతో బిజీ కానున్నారు. మహేష్ రాజమౌళి కాంబో మూవీ నెక్స్ట్ లెవెల్ లో ఉండనుందని అద్భుతమైన స్క్రిప్ట్ తో ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతుండగా మహేష్ భవిష్యత్తు సినిమాలతో ఇండస్ట్రీ హిట్లు సాధించాలని అభిమానులు మనస్పూర్తిగా కోరుకుంటున్నారు.

జవాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus